Andrala rakshasi movie review

andrala rakshasi movie review

andrala rakshasi movie review

21.gif

Posted: 08/10/2012 09:36 PM IST
Andrala rakshasi movie review

11111

సినిమా : ‘అందాల రాక్షసి’
విడుదల తేది : 10 ఆగష్టు 2012దర్శకుడు : హను రాఘపూడి
నిర్మాతలు : సాయి కొర్రపాటి, రాజమౌళి
సంగీతం : రథన్
తారాగణం : నవీన్, రాహుల్ మరియు లావణ్య
ఆంధ్రావిశేష్ కాం రేటింగ్ : 2.5
       ‘ఈగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన వారాహి చలన చిత్ర సంస్థ ద్వారా సాయి కొర్రపాటి నిర్మాతగా, ఎస్.ఎస్ రాజమౌళి సహా నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘అందాల రాక్షసి’. నవీన్, రాహుల్ అందాల భామ లావణ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ రోజు ‘అందాల రాక్షసి’ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
స్టోరీ క్లుప్తంగా:
      అందాల రాక్షసి క్లుప్తంగా ఒకే అమ్మాయి ప్రేమను కాంక్షించే ఇద్దరు కుర్రాళ్ల కథ. సినిమా మొత్తం హీరోయిన్ మిధున (లావణ్య) చుట్టూ నే పరిభ్రమిస్తుంటుంది. గిటారిస్ట్ గా పనిచేసే గౌతమ్ (రాహుల్) స్క్రాప్ ఆర్టిస్ట్ అయిన సూర్య (నవీన్) లు మిథున ప్రేమలో పడతారు. మిథున సూర్యని ప్రేమిస్తుంది. సూర్య - మిథున మధ్య రొమాంటిక్ ట్రాక్ జరుగుతూ ఉండగా ఒక ఊహించని మలుపు వస్తుంది. ఆ తర్వాత గౌతమ్ మిథున జీవితంలోకి వస్తాడు. మిథున గౌతమ్ యొక్క భావాలకూ. అతనికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. చివరికి వీరిద్దరి లవ్ కూడా కొత్త కోణం తీసుకుంటుంది. చివరికి మిధున ఎవరికి సొంతం అవుతుందనేదే క్లుప్తంగా ఈ మూవీ స్టోరీ
అనుకూలాంశాలు :
సింపుల్ గా చెప్పాలంటే లావణ్య కేక. లావణ్య నటన, అందం అందరినీ కట్టిపడేస్తుంది. సూర్య పాత్రలో నవీన్ చాలా బాగా చేశాడు. ఈ చిత్రానికి ఇతని పాత్రే కీలకం. ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో నవీన్ కథలోకి వచ్చిన తర్వాత సినిమా చాలా వేగంగా ముందుకెలుతుంది. లావణ్య మరియు నవీన్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. సి.వి.ఎల్ నారాయణ నటన పరవాలేదనిపించాగా, ప్రగతి నటన బాగుంది. రాహుల్ నాన్న గారి పాత్ర చేసిన యాక్టర్ నటన బాగుంది. ఈ చిత్రంలో విజువల్స్, సాంకేతిక విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ పనితనం ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. విజయ్ ఎంట్రీ బావుంది . దర్శకుడు చాలా సంభాషణలను కవితాత్మకంగా తెరకెక్కించాడు.
ఇవి ప్రతికూలం :
ఫస్టాఫ్ స్లో అండ్ స్టడీ. రాహుల్ పాత్ర చాలా వీక్.  డైలాగ్ డెలివరీ మీద శ్రద్ద వహిస్తే బాగుండేది. అతను ప్రతి డైలాగ్ ని అరిచినట్టు చెప్పాడు. ఈ చిత్ర క్లైమాక్స్ కూడా మన ప్రేక్షకులకు మింగుడుపడదు. మొత్తంగా సినిమా ఒక గాఢమైన ప్రేమకథైనప్పటికీ అంతగా ఫీలయ్యే ప్రేమ హీరో హీరోయిన్ల మధ్య కనిపించదు. ఆధ్యంతం ‘చచ్చిపోతా’ అనే డైలాగ్ తోనే సరి.
టెక్కికల్ వాల్యూస్ :
చిన్న సినిమా అయినప్పటికీ మంచి నిర్మాణ ప్రమాణాలు పాటించినట్టు సినిమా చూస్తే ఇట్టే అవగతం అవుతుంది. మురళి అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం. ఎడిటింగ్ విభాగంలో శ్రద్ద మరింత చూపించాల్సింది. డైలాగ్స్ ఓ మోస్తరు. హను రాఘవపుడి దర్శకత్వం ఓకే. స్క్రీన్ ప్లే.. డల్.
చివరి మాట :
సాంకేతిక పరంగా విలువలున్న చిన్న సినిమా అయినా, కథనం పరంగా బక్సాఫీస్ ఆదరణ కష్టమే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi collects 11 crore in first day
Victory venkatesh movie shadow coming for sankranthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles