Chanti addala 30years industry

chanti addala 30years industry

chanti addala 30years industry

9.gif

Posted: 08/07/2012 03:49 PM IST
Chanti addala 30years industry

       తెలుగు చలన చిత్ర రోజువారీ తీరుతెన్నులు నిశితంగా పరిశీలించే సమయంలో ఇవాళ చెప్పుకోదగ్గ వ్యక్తి చంటి అడ్డాల. ఇవాళ్టి రోజున అంటే..  ఆగస్టు 7.2012తో ఆర్ట్‌ డైరెక్టర్‌ చంటి అడ్డాల కెరీర్‌ 30 ఏళ్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చంటి మీడియాతో ముచ్చటించి తన సినీ ప్రస్థానాన్ని వివరించారు.  ఆగస్టు 7,1982లో మద్రాసులో అడుగుపెట్టిన తేదీ. పాల కొల్లులో దాసరి ఇంటిపన్కనే మా ఇల్లు. ఆ బంధం వల్ల.. ఆయన రికమంటేషన్‌తో పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ ద్వారా పరిశ్రమలో అడుగుపెట్టాను. ఫ్రీహ్యాండ్‌ రైటింగ్‌, chanti_addala_eeeడిజైనింగ్‌ లో నా స్కిల్‌ చూసి కళాదర్శక శాఖలో చేర్చారు. సహాయ దర్శఖులు ఇంటికొకరు వున్న రోజులవి. అందుల్ల దాసరి సలహా పాటించాను. ఈశ్వర్‌ ద్వారా కళాదర్శఖడు భాస్కర రాజు అప్రెంటీస్‌గా చేరాను. ఆరంభమే గుడ్‌ రిపోర్ట్‌. దాసరి ప్రేమాభిషేకం (హిందీ) చిత్రానికి దేవాలయం సెట్‌కు పనిచేసి గుర్తింపు పొందాను. దాంతో నాలుగు రోజుల్లోనే మోహన్‌బాబు ధర్మపోరాటం చిత్రానికి శ్రీనివాసరాజు (భాస్కరరాజు తనయుడు) వద్ద సహాయ కుడిగా అవకాశమొచ్చింది.
        రు.600 నా తొలిజీతం. మోహన్‌బాబు రూ.10 వేలకే సెట్‌ వేయమని తొలి సవాల్‌ విసిరారు. అంత తక్కువ మొత్తంతో కష్టమే. అందుకే సృజనాత్మకంగా ఆలోచించి రిబ్బన్‌లతో ఓ సెట్‌ వేసి మెప్పించాను. దానికి రూ.116 బహుమానం దక్కింది. ఆ తర్వాత కృష్ణ 'అగ్ని పర్వతం' సినిమాకు మరోసారి రిబ్బన్‌ల సెట్‌ వేశాం. ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి వెన్నంటి నిలిచారు.
        ఇదంతా ఒక ఎత్తయితే... రామానాయుడు చిత్రం ద్వారా కళాదర్శకుడిగా మారాను. ఆయన 'ప్రేమ'చిత్రానికి నన్ను ఆర్ట్‌ డైరెక్టర్‌ను చేశారు. ఆ తర్వాత రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు వంటి చిత్రాలకు పనిచేశాను. 24గంటల్లో సెట్‌ వేసినందుకు నాయుడు చాలా సినిమాలకు అవకాశం కల్పించారు. తొలి చిత్రం 'ప్రేమ'కు నంది జ్యూరీ అవార్డు దక్కింది. చిరంజీవి చిత్రాలకు పనిచేశాను. రాజావిక్రమార్క చూసి చిరంజీవి నచ్చి మరిన్ని అవకాశాలు ఇచ్చారు. హిందీలో 8, కన్నడలో 3 సినిమాలు మొత్తంకలిపి 174 సినిమాలకు కళాదర్శకునిగా పనిచేశాను.
         ఆ తర్వాత ఛాయాగ్రహకులు వి. శ్రీనివాసరెడ్డితో కలిసి 'ఆరోప్రాణం' చిత్రంతో నిర్మాతనయ్యా. ప్రస్తుతం నరేష్‌తో సోషియోఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నా. దీనికి 11 భారీ సెట్‌లు వేశాం. ఇది పూర్తయ్యాక.. ఓ పెద్ద హీరోతో నా డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ చేయనున్నట్లు చెప్పారు అడ్డాల. గుడ్ గోయింగ్ చంటీ.. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రావిశేష్.కాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas rebel movie first look release
Threee heroines in karimnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles