Sunny leone jism 2 movie review

sunny leone jism 2 movie review

sunny leone jism 2 movie review

9.gif

Posted: 08/03/2012 04:04 PM IST
Sunny leone jism 2 movie review

jism_2_inner

చిత్రం పేరుజిస్మ్2
విడుదల తేది :  03 ఆగస్ట్ 2012

దర్శకుడు :  పూజ భట్
నిర్మాత :  డినో మోరియ, పూజ భట్
సంగీత దర్శకుడు : పి. ముఖర్జీ,మిథూన్
తారాగణం :  సన్నీ లియోన్,రన్దీప్ హుడా, అరుణోదయ్ సింగ్
సంగీతం :  అర్కో పర్వో ముఖర్జీ, మిథూన్
రచన  :     మహేష్ భట్
సినిమాటోగ్రఫీ :  నిగం బొంజాన్
బ్యానర్లు :  క్లాక్ వర్క్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిష్ ఐ నెట్వర్క్
ఆంధ్రావిశేష్.కాం రేటింగ్ 2.0/5

    

     jism_1  చాలా కాలంగా సినీ ప్రియులతో పాటు, శ్రుంగార ప్రియులు ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన పోర్న్ స్టార్ సన్నీలియోన్ డెబ్యూ మూవీ జిస్మ్2 ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పోస్టర్లు, ప్రోమోలలో ఘాటయిన సన్నివేశాలు చూపించడం ద్వారా ఈ చిత్రం మీద అంచనాలు పెరిగిపోయాయి. పూజా భట్ ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించగా, రన్దీప్ హుడా మరియు అరుణోదయ్ సింగ్ లు సన్నీ లియోన్ సరసన ప్రధాన పాత్రలు పోషించారు.
చిత్ర కథ  క్లుప్తంగా :
       క్లుప్తంగా మోసానికి గురైన ఓ అమ్మాయి తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంది అనేది ఈ సినిమా ఇతి వ్రుత్తాంతంగా చెప్పవచ్చు. కథ లోకి వెళ్తే.. ఇజ్న (సన్నీ లియోన్) ఒక అడల్ట్ యాక్ట్రస్ ఈమెని కబీర్ (రన్దీప్ హుడా) మోసం చేస్తాడు. మోసపోయిన ఇజ్న చనిపోవాలని అనుకుంటుంది అప్పుడు స్పెషల్ ఏజెంట్ ఆయన (అరుణోదయ్ సింగ్) ఆమె ప్రయత్నాన్ని ఆపి దేశం కోసం పని చెయ్యమని కోరుతాడు. ముందు ససేమిరా ఒప్పుకొని ఇజ్న తరువాత ఒప్పుకుంటుంది. వీరు ఇద్దరు కలిసి కబీర్ ని అంతమొందించడానికి ప్రణాళిక వేస్తారు. దీంతో.. చిత్రం కబీర్ నివసిస్తున్న శ్రీలంక కి మారుతుంది. ఇజ్న తిరిగి కబీర్ జీవితంలోనికి మెల్లగా ప్రవేశిస్తుంది కబీర్ అనుమానంతో ఆమెను పూర్తిగా తనిఖీలు చేస్తాడు ఎటువంటి ఆధారం దొరకకపోవడంతో ఆమెని తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు. కబీర్ ఇజ్న ని నమ్మడం మొదలెట్టాక కథలోకి మోసం, అనుమానం మరియు ఈర్ష్య అనే అంశాలు ప్రవేశిస్తాయి. ఇజ్న నిజంగా ఎవరిని ప్రేమించింది? కబీర్ నిజంగా ఇజ్నని ప్రేమించాడా? ఆయన ఏమయ్యాడు? అనేవి చిత్రంలో చూడాల్సిందే..
అనుకూలాంశాలు :
     శారీరక, ప్రక్రుతి అందాలు తెరపై చూపించటంలో దర్శక, సినిమాటోగ్రఫీ సఫలీక్రుత మయ్యరు. ఈ చిత్రంలో కనిపించిన మూడు ప్రధాన పాత్రల ఫిజిక్ రసాత్మకంగా ఉంది. నటన గురించి పక్కన పెడితే సన్నీ లియోన్ ఏమాత్రం దాచుకోకుండా అందాలు ఆరబోసి, ఆశించిన వచ్చిన వారికి తన వరకూ న్యాయం చేసింది.
ప్రతికూలాంశాలు :
      మొత్తంగా చెప్పాలంటే.. ఈ చిత్రంలో చాలా లోపాలు కొట్టొచ్చినట్టు అగుపిస్తాయి. దాదాపు ప్రతీ నటుడి ప్రదర్శన విసుగు, నీరసాన్ని తెప్పించాయి. ఎంతో ప్రతిభ కల రన్దీప్ హుడా కూడా నిరాశ పరిచాడు. ఈ చిత్రం పరాజయం చవి చూస్తుంది అని ముందే తెలిసినవాడిలా జీవం లేని హావభావాలను పలికించాడు. సన్నీ లియోన్ నటన పరంగా ఏమాత్రం మెప్పించలేకపోయింది. అరుణోదయ్ సింగ్ కి ఎక్కడ jism_inneeఏడవాలో ఎక్కడ ఆనందించాలో కూడా అసలు తెలియనట్టు ఉంది. కథ  చెప్పిన విధానం వెబ్బెట్టు కలిగిస్తుంది. పూజ భట్ మరియు మహేష్ భట్ కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను అనుకోని వాటి మధ్య నింపడానికి మరి కొన్ని సన్నివేశాలను రాసుకున్నట్టు అనిపిస్తుంది. పోనీ శ్రుంగార పరంగా త్రుప్తి నిస్తుందంటే.. చిత్రంలో చెప్పుకోదగ్గ హాట్ సన్నివేశాలు కూడా లేవు. ఘాటయిన చుంబన దృశ్యాలు మినహా ఈ చిత్రంలో చెప్పుకోడానికి ఏమి లేదు.
టెక్నికల్ వాల్యూస్ :
     సినిమా ఇంత హైప్ క్రియేట్ చేయటంలో ప్రధాన భూమిక కెమెరా పనితనమే అనిచెప్పాలి.  నిగం బొంజాన్ సినిమాటోగ్రఫీ మాత్రమే చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం. విజువల్స్ మరియు లొకేషన్లను చాలా అందంగా చూపించారు. అసలే బాలేని స్క్రీన్ప్లే కి ఘోరమయిన ఎడిటింగ్ తోడయ్యి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపించాగా ఆడియో హిట్ అయినా  పాటల చిత్రీకరణ చెప్పుకునే స్థాయిలో లేదు. దర్శకురాలిగా పూజ భట్ పూర్తిగా విఫలమయ్యారపిస్తుంది.
ముగింపు మాట :
     జిస్మ్ 2 అట్టర్ ప్లాప్ చిత్రం గా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. సన్నీ లియోన్ అందాలు ఎలాగైనా చూసి ఆనందించాలనుకునే కోరిక మాత్రమే ఈ సినిమాకు రక్ష. అంతకు మించి ఈ చిత్రం గురించి చెప్పుకోడానికి ఏమి లేదు. శుభం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif remuneration for ads
Vani sri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles