Nani and amala pauls janda pai kapiraju starts

nani and amala paul's janda pai kapiraju starts

nani and amala paul's janda pai kapiraju starts

13.gif

Posted: 08/02/2012 02:56 PM IST
Nani and amala pauls janda pai kapiraju starts

       నాని, అమలాపాల్‌ నటీనటులుగా వాసన్స్‌ విజువల్‌ వెంచర్స్‌ సమర్పణలో కె.ఎస్‌.శ్రీనివాసన్‌ నిర్మిస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'.jenda_in 'శంభో శివశంభో' చిత్రం తరువాత పి.సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. తొలి సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, ఆర్‌.బి.చౌదరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించగా చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాని, అమలాపాల్‌, కె.ఎస్‌.శ్రీనివాసన్‌, పి.సముద్రఖని, శశాంక్‌ వెన్నెలకంటి మరియు జి.వి. ప్రకాష్‌లు పాల్గొన్నారు.
        దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ... దర్శకుడిగా నాకిది మూడవచిత్రం. డైరెక్ట్‌ సినిమాల్లో రెండవది. ప్రతిరోజు మన సొసైటిలో ఎదురయ్యే సమస్యల గురించి తెలిపే చిత్రమిది. మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం అంతా సరిదిద్దుకుంటుంది. అనే కాన్సెప్ట్‌ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము సమాజానికి మంచి సందేశాన్నిస్తుందీ ఈ సినిమా అన్నారు. నాని మాట్లాడుతూ ...నాకు ఇష్టమైన దర్శకుల్లో సముద్ర jenda_innerఖని ఒకరు. నాకు నచ్చిన దర్శకు లందరి తోను నాకు అవకాశాలు రావడం చాలా అనందంగా ఉంది. నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు అన్నింటికన్నా ఈ సినిమాలో నేను చేసే క్యారెక్టర్‌ చాలెంజింగ్‌గా ఉంటుంది. 'జెండాపై కపిరాజు' టైటిల్‌ విక్టరీకి, వార్‌కి సింబల్‌, చెడు మీద సాగించే యుద్ధమే ఈ చిత్రం. మనలో చెడుచచ్చిపోతే ప్రపంచంలో ఉన్న చెడు కూడా చచ్చిపోతుందని తెలిపే చిత్రమిది. త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్ళబోతున్నాము. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నిర్మాత కె.ఎస్‌.శ్రీనివాసన్‌మాట్లాడుతూ ... మా దర్శకుడు చెప్పిన కథలో మంచి సందేశముంది. మంచి నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు మాకు దొరికారు. మొదట గోవాలో పాటల చిత్రీకరణ ప్రారంభిస్తాము. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో హైదరాబాద్‌, వైజాగ్‌లలో ఫుల్‌ షెడ్యూల్స్‌ జరుగుతాయి అని అన్నారు.
        ఈ చిత్రానికి మాటలు :శశాంక్‌,వెన్నలకంటి, ఫోటోగ్రఫీ, ఎస్‌. సుకుమార్‌, సంగీతం, జి.వి.ప్రకాష్‌, లిరిక్స్‌. అనంత శ్రీరామ్‌, ఆర్ట్‌, జాకీ, ఎడిటింగ్‌, ఎస్‌.ఎన్‌. ఫాజిల్‌, నిర్మాత కె.ఎస్‌.శ్రీనివాసన్‌, దర్శకత్వం .సి.సముద్రఖని.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now a days young stars 3g love
Mondi mogudu dubbing telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles