Telugu cinema heroine soundarya

Telugu cinema heroine Soundarya,Soundarya Photo Gallery,Old Actress Soundarya stills,Soundarya Hot Pics, Soundarya Stills, Soundarya Images, Soundharya photos

Telugu cinema heroine Soundarya

Soundarya.gif

Posted: 07/18/2012 05:59 PM IST
Telugu cinema heroine soundarya

Telugu cinema heroine Soundarya

సౌందర్య. ఈ పేరు తెలుగు సినీ రంగంలో ఓ సంచలనం. అందానికి అందం.. అభినయానికి.. అభినయం ఆమె సొంతం. టాలీవుడ్‌లో గట్టి పోటీ ఉన్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన సౌందర్య... వెండి తెరపై చెరగని ముద్ర వేసింది. సావిత్రికి రీ ప్లేస్‌మెంట్‌ ఎవరంటే, సౌందర్యే అనే లెవల్లో యాక్టింగ్‌ చేసింది. సౌందర్య జయంతి సందర్భంగా ఓ స్పెషల్‌ స్టోరీ.  సౌందర్య లేని తెలుగు సినీ రంగాన్ని ఊహించుకోవడం నిజంగా కష్టం. ఎన్నో సినిమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సౌందర్య, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. చూడ్డానికి క్యూట్‌గా కనిపించే ఈ నటి, ఏనాడూ ఎక్స్‌పోజింగ్‌ జోలికి పోలేదు. అద్భుతమైన అభినయంతో నటిస్తూ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది. బాడీ లాంగ్వేజ్‌తోనే గ్లామర్‌ ఒలకబోయొచ్చని ప్రూవ్‌ చేసింది.రైతుభారతం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హలో బ్రదర్‌ వరకు చిన్న సినిమాలకే పరిమితమైన ఈ అందాల నటి, ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్లతో నటించింది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోలు కూడా సౌందర్యతో సినిమా చేసేందుకు ఇష్టపడే స్థాయికి చేరింది.  విక్టరీ వెంకటేశ్‌తో కలిసి పవిత్ర బంధం సినిమాలో నటించిన సౌందర్య, మంచి పేరు తెచ్చుకుంది. చూడాలని ఉంది సినిమాలో చిరు పక్కన అమాయకత్వం కలబోసిన అమ్మాయిగా నటించింది.ఇక సౌందర్య మాత్రమే చేయగల సినిమాలు చాలానే ఉన్నాయి. క్రాంతికుమార్‌ తొమ్మిది నెల్లు, కృష్ణవంశీ అంతఃపురం ఈ కోవలోకే వస్తాయి. అమ్మోరు సినిమాలోనూ సౌందర్య నటన అద్భుతం.నటిగా అగ్రస్థానంలో కొనసాగుతుండగానే సౌందర్య రాజకీయాల్లో అడుగుపెట్టింది. బీజేపీ తరఫున 2004 ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఆ సమయంలోనే విమాన ప్రమాదంలో కన్ను మూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Censor board refused to certify sunny leone jism 2
Julayi satellite rights fetch rs 57 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles