Action with entertainment

action with entertainment

action with entertainment

17.gif

Posted: 07/12/2012 07:52 PM IST
Action with entertainment

      బిందాస్‌, అహనా పెళ్లంట చిత్రాల నిర్మాత అనిల్‌ సుంకర్‌ ఇప్పుడు దర్శకుడుడయ్యారు. ఎకె ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఆయన తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'యాక్షన్‌' (విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) అనేపేరు పెట్టారు. ఇందులో నరేష్‌, శ్యామ్‌, రాజు సుందరం, వైభవ్‌ నటిస్తున్నారు. స్నేహ ఉల్లాల్‌, కామ్న జెఠ్మలానీ, రేతూ బర్మేచ, నీలం ఉపాధ్యా హీరోయిన్లు. బప్పా-బప్పీలహరి సంగీతం అందిస్తు న్నారు. ఈ చిత్రం ఇప్పటికి యాభైశాతం పూర్తయింది.action_eeeeee
       ఈ సందర్భంగా దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కొత్త దర్శకుడినని చూడకుండా చేయడానికి నరేష్‌ అంగీకరించారు. టెక్నీషియన్స్‌ కూడా సహకరించారు. ఇది 3డిలో రూపొందే చిత్రం. ఏదో కొత్తప్రయోగం చేయాలని చేశాను. దీనికి హాలీవుడ్‌కు చెందిన కేత్‌ స్టీరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అనుకున్న విధంగా రావడానికి ఎంతో సహకరించారు. తర్వాత షెడ్యూల్‌ బ్యాంకాక్‌, గోవాలో చిత్రించాల్సి వుంది. త్వరలో తీయ నున్నామని తెలిపారు.
       నరేష్‌ మాట్లాడుతూ తొలిసారిగా తెలుగులో కామెడీతో 3డి సినిమా రాబో తుంది. ఏడాదిపాటు అనిల్‌గారు స్టోరీ రెడీ చేసుకున్నారు. దర్శకత్వంలో అనుభవం లేక పోయినా అమెరికాలో ఆయన కోర్సు చేశారు. నిర్మాతగా వున్నప్పుడు దర్శకుని ప్రతిభను పరిశీలించేవారు. ఇందులో రాజుసుందరం మాస్టార్‌ రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించారు. రెండు బాషల్లోనూ వేర్వేరుగా చిత్రికరిస్తున్నారని చెప్పారు.  స్నేహ ఉల్లాల్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా వుంటుందన్నారు. నరేష్‌తో రెండవ సినిమా ప్లస్ 3డి సినిమాలో చేయడం ఆనందంగా వుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi go to london today
Abhishek bachhan fire on media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles