Svr mr 7 coming soon

svr mr 7 coming soon

svr mr 7 coming soon

1.gif

Posted: 07/12/2012 04:01 PM IST
Svr mr 7 coming soon

      విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు ఎస్వీఆర్‌ సినీ కార్ప్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బేనర్‌పై ఆయన మనవడైన ఎస్వీఆర్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న 'మిస్టర్‌ 7' (వీడు ఎవరికీ దొరకడు) చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది.
     Mr-7-Movie_inner  ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌విఎల్‌ ఎస్‌ రంగారావు మీడియాతో ముచ్చటించారు. మా బ్రదర్‌ ఎస్వీఆర్‌ హీరోగా వస్తున్న తొలి చిత్రం 'మిస్టర్‌ 7' పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌. అటు యూత్‌ని, ఇటు ఫ్యామిలీస్‌ ని ఆకట్టుకుంటుంది. మా తాత పేరు నిలబెట్టే విధంగా మా తమ్ముడు ఎస్‌విఆర్‌ చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. యాక్షన్‌ సీన్స్‌లో ఎంతో లైఫ్‌ రిస్క్‌ తీసుకొని ఎక్స్‌ లెంట్‌గా చేశారు. అదే విధంగా సాంగ్స్‌ లో కూడా ఎంతో ఈజీతో డిఫరెంట్‌ స్టెప్స్‌ వేశారు. పాటలు ఆల్రెడీ సూపర్‌హిట్‌ అయ్యాయి. మా తాత జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ బేనర్‌లో కంటిన్యూగా మా తమ్ముడితోనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమా ప్లాన్‌ చేస్తాం. బిజినెస్‌పరంగా కూడా మా తాత బ్యాక్‌గ్రౌండ్‌ వుండడం వల్ల హ్యాపీగా వున్నాం. ఎస్వీఆర్‌ని మంచి హీరోగా ఎలివేట్‌ చేసేందుకు ఉపయోగపడే చక్కని కథ. ఈ సినిమా ఘనవిజయం సాధించి మా ఎస్వీఆర్‌ సినీ కార్ప్‌ కి, మా తమ్ముడికి మంచి పేరు తెస్తుందన్న నమ్మకం నాకు వుందన్నారు.
      ఎస్వీఆర్‌, నీలం ఉపాధ్యాయ, శ్రీనివాసరెడ్డి, ఎంఎస్‌ నారాయణ, చలపతిరావు, ఏవీయస్‌, గుండు హనుమంతరావు, శ్రావణ్‌, పృధ్వీ, సత్యం, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: ప్రదీప్‌ సిహెచ్‌., సంగీతం: మున్నా కాశి, పాటలు: పోతుల రవికిరణ్‌, కొరియోగ్రఫీ: అజరుసాయి, నంది, సినిమాటోగ్రఫీ: జె.ప్రభాకర్‌రెడ్డి, స్టంట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, ఎడిటింగ్‌: ఉద్భవా, ఆర్ట్‌: గోపీ, మేకప్‌: రమేష్‌ కె., కాస్ట్యూమ్స్‌: రామకృష్ణ కల్లూరి, స్టిల్స్‌: మణి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఎల్‌.కాళీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చైతన్య కె.కో-డైరెక్టర్‌: దాసం ప్రసాద్‌, సమర్పణ: బేబీ నాగజయ స్వస్తిక, నిర్మాతలు: ఎస్‌విఎల్‌ఎస్‌. రంగారావు, ఎస్‌.వి.రంగారావు, దర్శకత్వం: ఎస్‌.ఆర్‌. చరణ్‌రెడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram anushka sivatamdavam
Rajamouli about chiru 150th film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles