Anti pirates operation on to catch big fish

Anti-pirates operation on to catch big fish,,ANDHRANEWS, D.SURESH BABU, eega, Film news, Piracy, Suresh productions,anti-pirate operation jointly led by AP Film

Anti-pirates operation on to catch big fish

Anti.gif

Posted: 07/03/2012 06:45 PM IST
Anti pirates operation on to catch big fish

Anti-pirates operation on to catch big fish

ఎంపీడీఎ(మోషన్‌ పిక్చర్‌ అసోసియేషన్ ఆఫ్ అమెరికా), ఎపిఎఫ్‌సిసి (ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) జాయింట్‌ ఆపరేషన్‌ ఒప్పందం కుదిరిన కొద్దికాలంలోనే పైరసీని కంట్రోల్‌ చేశామని ఛాంబర్‌ అద్యక్షుడు డి. సురేష్‌బాబు తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ సిఐడి పోలీసు మూడు పెద్ద చేపల్ని పట్టింది.చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న వీడియో పైరసీకారుడు రాజేంద్ర పువ్వాడి, హైదరాబాద్‌కు చెందిన కత్తుల చైతన్య, విజయవాడకు చెందిన ప్రవీణ్‌లను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం వీరిపై కేసులు నమోదయ్యాయి. వీరందరికీ దేశంలోని పలు నగరాలలో నెట్‌వర్క్‌ ఉంది. కోట్లాది రూపాయల విలువ చేసే సినిమా సీడీలను పోలీసులు పట్టుకున్నారు. ఆపరేషన్‌ దిగ్విజయంగా జరిగింది' అన్నారు.

యాంటీ పైరసీ సెల్‌ ప్రత్యేక అధికారి సిఐడి ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ, ఛాంబర్‌ పూర్తి సహకారంతోనే ఇది సాధ్యపడింది. పైరసీ అనేది కేవలం థియేటర్‌ నుంచేకాదు. లాబ్‌ల నుంచి కూడా వస్తోందని మా వద్ద రిపోర్ట్‌ ఉంది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. అదేగాక బీటెక్‌, కంటప్యూర్‌ కోర్సులు చేసిన విద్యార్థులు పైరసీని ముందుండి నడిపిస్తున్నారు.కేవలం 13 డాలర్ల అద్దెతో విదేశీ వెబ్‌సైట్లు అద్దెకు దొరుకుతాయి. వాటిలో సినిమాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసి క్యాష్‌ చేసుకోవడం వీరిపని. ఇదంతా వారి తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నారు. కొందరైతే పైరసీని నివారించడానికి సాఫ్ట్‌వేర్‌లు ఇస్తామంటూ.. వచ్చి యధేచ్చగా తమ వ్యాపారానికి బాటలు వేస్తున్నారు. దీనిపై సీరియస్‌గా నిఘా పెడుతున్నాం' అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Criminal case on story writer chinni krishna
Rajini first item number for aamir khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles