New film studio at ou colony hyderabad

new film studio at ou colony hyderabad

new film studio at ou colony hyderabad

11.gif

Posted: 07/02/2012 02:39 PM IST
New film studio at ou colony hyderabad

1eee    తెలుగు ఫిల్మ్‌ ఇండిస్టీకి సుపరిచితులైన రామగోపాల్‌ తన తల్లిదండ్రుల పేరిట 'రాజా ప్రతాప్‌' అనే ఓ స్టూడియోను హైదరాబాద్‌ ఓయు కాలనీలో ప్రారంభించారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌, దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించి స్టూడియోను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో...సాగర్‌ మాట్లాడుతూ..'రామ్‌గోపాల్‌ ఇండిస్టీకి బాగా సుపరిచితుడు. ఈరోజు డబ్బింగ్‌, ఎడిటింగ్‌, రికార్డింగ్‌ తదితర కార్యక్రమాల కోసం లేటెస్ట్‌ ఎక్విప్‌మెంట్‌తో ప్రారంభించిన ఈ స్టూడియో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా'నని అన్నారు.1e ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ..'రామగోపాల్‌ తన పేరెంట్స్‌ పేర ప్రారంభించిన ఈ క్రియేటివ్‌ సంస్థ మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాని. ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు' అని కితాబిచ్చారు.. రామగోపాల్‌ మాట్లాడుతూ..'నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్‌ అంటే ఇష్టం. ఎప్పటినుంచో ఈ స్టూడియోను పెట్టాలనుకున్నా. ఈరోజుకి ఆ టైం వచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌కు సంబంధించి అన్నీ లేటెస్ట్‌ ఎక్విప్‌మెంట్‌తో ఎన్నో వ్యయ ప్రయాసలతో నేనీ స్టూడియోను పెట్టాను. సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా'నని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jism2 trailar hal chal in internet
Balakrishna srimannarayan shooting compleate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles