Gb antyakshari team

gb antyakshari team

gb antyakshari team

21.gif

Posted: 06/29/2012 08:38 PM IST
Gb antyakshari team

      పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలోని అంత్యాక్షరి సన్నివేశానికి వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. కొత్త 3eతరహాలో వినోదాన్ని పంచుతూ సాగే ఆ సన్నివేశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అందుకే, పదిహేను నిమిషాల పాటు సాగే ఆ సన్నివేశాన్ని తన 'దబాంగ్-2' సినిమాలో పెట్టుకుంటానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్ర నిర్మాత నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే, ఇప్పుడీ అంత్యాక్షరి సీన్ నిర్మాతకు కొత్త తలనొప్పి తెస్తోంది. ఇందులో ఉపయోగించిన పలు పాటల సంగీత దర్శకులు, రచయితలూ కలిసి చిత్ర నిర్మాత నుంచి రాయల్టీ డిమాడ్ చేస్తున్నారట. ఏపీ సినీ రైటర్స్ అసోసియేషన్ ద్వారా వీరు తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. పైగా, పెద్ద మొత్తంలోనే వీరు రాయల్టీ కోరుతున్నారట. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత వద్ద మీడియా ప్రస్తావిస్తే, ఈ విషయంలో తనకు ఎవరి నుంచీ అటువంటి డిమాండ్ రాలేదనీ, అయినా ఆ సీన్ కోసం వాడుకున్న పాటల నిమిత్తం ఎవరికైనా డబ్బు చెల్లించాలని తాను అనుకోవడం లేదనీ చెప్పాడు. అయితే, ఆయా రచయితలూ, మ్యూజిక్ డైరెక్టర్లూ మాత్రం నిర్మాత నుంచి ఎంతో కొంత లాగడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer aswani dutt movie post phoned
Stars cricket at vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles