Music director ms viswanath birthday today

music director ms viswanath birthday today

music director ms viswanath birthday today

3.gif

Posted: 06/24/2012 02:51 PM IST
Music director ms viswanath birthday today

      మధురమైన బాణీలకు ... మనోహరమైన స్వరాలకు ఎమ్మెస్ విశ్వనాథన్ పేరు పుట్టినిల్లు అని చెప్పొచ్చు. ఆనందాన్ని ... ఆవేదనని ... వినోదాన్ని ... విషాదాన్ని ఇలా ఏ సందర్భాన్ని అయినా తన బాణీతో అద్భుతంగా ఆవిష్కరించగల నైపుణ్యం ఆయన సొంతం. కేరళలోని పాలక్కడ్ లో 1928 జూన్ 24 న అంటే ఇవాల్టి రోజున జన్మించిన ఆయన, బాల్యం నుంచే సంగీతం పట్ల మక్కువని కనబరిచారు. తెలుగు ... తమిళ ... మలయాళ భాషల్లో  500 పైగా చిత్రాలకి ఆయన అపురూపమైన స్వరాలను సమకూర్చారు. త్యాగరాజ స్వామిని ఎంతగానో ఆరాధించే ఎమ్మెస్ విశ్వనాథన్, ఆయన మాతృభాష అయిన తెలుగులో స్వరాలను సమకూర్చడాన్ని అదృష్టంగా భావించేవారు.
   Ms  ఈ నేపథ్యంలోనే ఆయనని కె.బాలచందర్ ఎంతగానో ప్రోత్సహించారు. దాంతో 'అంతులేని కథ' ... 'ఇది కథ కాదు' ... 'మరో చరిత్ర' ... 'అందమైన అనుభవం' ...'ఆకలి రాజ్యం' ... 'గుప్పెడు మనసు'  వంటి చిత్రాలకి ఆయన అద్భుతమైన స్వరాలని  అందించారు. గుండెగుడిలో గూడు కట్టుకున్న ఈ పాటలు ఇప్పటికీ ఏ మనసు తలుపు తట్టినా మధురంగా వినిపిస్తాయి. ఇలా ఎన్నో సినిమాల్లోని పాటలకి తనదైన శైలిలో ప్రాణ ప్రతిష్ట చేశారాయన. కమనీయమైన ఆయన సంగీతానికి కరిగిపోని మనసు లేదు ... అనిర్వచనీయమైన అనుభూతితో ఆవిరికాని హృదయం లేదు. అందుకే ఆయనని ఎన్నో బిరుదులు వెదుక్కుంటూ వచ్చాయి ... మరెన్నో సత్కారాలు ఆయనని చేరి తరించాయి. తన సంగీతంతో సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చి పెట్టిన ఆ ప్రతిభా మూర్తి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ సంగీత సామ్రాట్ కి ఆంధ్రావిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ బర్త్డే విశ్వనాథ్ జీ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega star title for nandamoori family film
Muralimohan birth day today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles