''నేను గబ్బర్ సింగ్ సినిమా తీస్తుంటే.. చాలామంది ఫోన్ చేసి... హీరో శివాజీని తీసుకోవాలని సూచించారు. దానికి కారణం కూడా ఉంది. ఖుషీ, జల్సా చిత్రాల్లో ఆయన నటించారు. ఆ రెండూ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో కూడా తీసుకుంటే... బాగుంటుందని అన్నారు. నేను కూడా ఆలోచించి... శివాజీకి తగిన పాత్ర ఏది అని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ బ్రదర్ పాత్రలో చూపించాలనుకుంటే... అది నెగెటివ్ రోల్. ఇప్పటికే హీరోగా పాపులర్ అయిన శివాజీని.. అలా చూపించడం నాకే ఇబ్బంది కల్గింది'' అంటూ హరీష్ శంకర్ అనగానే.. అక్కడే ఉన్న శివాజీ అందుకుని.. అదేం కాదులెండి.. ఏదో చెబుతున్నారంతే అంటూ నవ్వుతూ అన్నారు.. మళ్లీ హరీష్ అందుకుని.. నేను చెప్పేది నిజం అంటూ... ఏదిఏమైనా శివాజీ లేకపోయినా గబ్బర్‌సింగ్ హిట్ అయిందంటూ ముగించారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఇది సోమవారంనాటి 'ఏం బాబూ లడ్డూ కావాలా' అనే ఆడియో ఫక్షన్‌లో జరిగింది. శివాజీ హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఇదిలా ఉండగా, 'గబ్బర్ సింగ్' రూపంలో పవన్ కల్యాణ్ ఇంకా రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు. ఇప్పటికే భారీ కలక్షన్లతో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన ఈ సినిమా హైదరాబాదులో ఓ సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఈ నెలాఖరుకి ఇది 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, హైదరాబాదు నగరంలో అత్యధిక సెంటర్లలో (డైరెక్ట్ దియేటర్లు) ఫిఫ్టీ డేస్ రన్ జరుపుకున్న సినిమాగా రికార్డు సొంతం చేసుకుంటోంది. నగరంలో మొత్తం 20 డైరెక్ట్ సెంటర్లలో అర్ధ శతదినోత్సవాన్ని ఈ 'గబ్బర్ సింగ్' జరుపుకుంటోంది.ఇప్పటికే మొత్తంగా 70 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ ముందు ముందు మరెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాలి!
'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా షూటింగు గత నాలుగు రోజులుగా హైదరాబాదు సారధీ స్టూడియోలో జరుగుతోంది. స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో పవన్ కల్యాణ్ , తమన్నాలపై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పూరీ జగన్నాథ్ పని పట్ల పవన్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. స్క్రిప్ట్ పట్ల పూరీకున్న కమాండ్ కి పవన్ అడ్మైర్ అవుతున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. సినిమా షూటింగు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతోందనీ, పవన్ కల్యాణ్ మంచి మూడ్ తో షూటింగు చేస్తున్నారనీ పూరీ జగన్నాథ్ అంటున్నాడు. తన 'డార్లింగ్' ప్రకాష్ రాజ్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడని పూరీ ఆనందంగా చెబుతున్నాడు. మొదట్లో ప్రకటించినట్టుగా చిత్రాన్ని అక్టోబర్ 18 న రిలీజ్ చేస్తామని పూరీ జగన్నాథ్ మరోసారి మాట ఇస్తున్నాడు!
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more