Maa inti mahalakshmi upasana says chiranjeevi

Maa Inti Mahalakshmi Upasana Says Chiranjeevi

Maa Inti Mahalakshmi Upasana Says Chiranjeevi

Maa Inti Mahalakshmi Upasana Says Chiranjeevi.gif

Posted: 06/16/2012 04:54 PM IST
Maa inti mahalakshmi upasana says chiranjeevi

Chiru_upasana_cherry

మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు అయిన చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ వివాహం ఈ నెల 14 న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ – ఉపాసనల పెళ్లికి మెగా ఫ్యామిలీ అభిమానులకు నిన్న హిమాయత్ సాగర్ జలాశయం దగ్గరలోని విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసేందే. ఈ విందుకు మెగా అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి తన అభిమాన హీరోకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్ళు వర్థిల్లాలని ఆశీర్వదించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు, చిరంజీవి, అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్, నాగబాబు పాల్లొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి స్టేజి పై చాలా ఉద్వేగంగా మాట్లాడారు. అదే సమయంలో తన ఇంటికి కోడలిగా వచ్చిన ఉపాసన పై కూడా ప్రశంసలు కురిపించాడు. "ఉపాసన మా ఇంటి మహాలక్ష్మీ, రాంచరణ్‌కు భార్యగా, మా కోడలుగా రావటం మా అదృష్టం'' అని చిరంజీవి అన్నారు. అభిమానులు లేనిదే మేము లేమని , ఎల్లప్పుడు మీ అభిమానం మాకు కావాలని, మీ ఆశీర్వాలు మాకు ఉండాలని ఉద్వేగంగా అన్నారు.  నాగబాబు మాట్లాడుతూ... అభిమానులూ తమ కుటుంబ సభ్యులేనని నాగబాబు అన్నారు. పెండ్లి కొడుకు చెర్రీ మాట్లాడుతూ... ఉపాసనతో నిశ్చితార్థం తర్వాత విడుదలైన 'రచ్చ' హిట్టయిందని రామ్‌చరణ్ గుర్తుచేసుకున్నారు. ఉపాసన తన జీవితంలోకి రావటం అదృష్టమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తానికి మెగా కుటుంబం సభ్యులు ఉపాసనను పొగడ్తలతో ముంచెత్తడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raji shifting his residence to coimbatore
Power star pawan kalyan new film poster  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles