Mega fance full josh in ram charan wedding reception

mega fance full josh in ram charan wedding reception

mega fance full josh in ram charan wedding reception

1.gif

Posted: 06/15/2012 01:49 PM IST
Mega fance full josh in ram charan wedding reception

2ee

రామ్ చరణ్, ఉపాసనల వివాహంలో ఈ రోజు మరో అంకం చోటుచేసుకుంటోంది. మెగా అభిమానులకు భారీ ఎత్తున వివాహ విందును ఏర్పాటు చేs  నిన్న కన్నుల పండవగా వివాహం జరుపుకున్న రామ్ చరణ్ ఈ రోజు తన ఫ్యాన్స్ కు విందు ఇస్తున్నాడు. మ్యారేజ్ జరిగిన వ్యవసాయ క్షేత్రంలోనే శుక్రవారం విందు ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ కు నూతన దంపతులతో పాటు, చిరంజీవి కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి విందు మొదలైంది. ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ వేడుకలో పాల్గొనడానికి కూడా ఫ్యాన్స్ కు పాసులు జారీ చేశారు. ఆ పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఆరు వేల మందికి పైగా అభిమానులు ఈ విందులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ విందులో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరు కుటుంభ సభ్యులంతా అభిమానులను ప్రేమతో అక్కున చేర్చుకుంటుండతంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

3e3

3e
         ఇదిలా ఉండగా, చరణ్-ఉపాసన వివాహానికి సంబంధించిన మరో రిసెప్షన్ ను దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లోని వివిధ పార్టీల ప్రముఖులకు ఉద్దేశించి ఈ విందు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ఎరేంజ్ చేస్తున్నారు.  ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్ తో బాటు వివిధ పార్టీల ప్రముఖులు కూడా ఈ రిసెప్షన్ కు హాజరవుతారని భావిస్తున్నారు.
     ఇదిలా ఉంచితే, త్వరలో చరణ్, ఉపాసన జంట హనీమూన్ కి వెళుతోంది. విదేశాలకు కాకుండా దేశంలోనే ఓ అందమైన ప్రదేశానికి నాలుగురోజుల హనీమూన్ ని పెట్టుకున్నారు. తిరిగి రాగానే, చరణ్ 'ఎవడు' షూటింగులో పాల్గొంటాడు.
    కాగా, రామ్ చరణ్, ఉపాసనల వివాహ రిసెప్షన్ నిన్న రాత్రి హైదరాబాదు మాదాపూర్లోని హైటెక్స్ లో వైభవంగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు ఆ చిత్రాలు మీకోసం....

3e4

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega movie promo release today
Rajamouli ega release date conformed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles