Rajamouli ega release date conformed

rajamouli ega release date conformed

rajamouli ega release date conformed

3.gif

Posted: 06/15/2012 01:42 PM IST
Rajamouli ega release date conformed

     రాజమౌళి 'ఈగ' థియేటర్లను చుట్టేసేందుకు సమయం వచ్చేసింది. ఈ  సినిమా విడుదల కోసం అశేష ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.2e అయితే గ్రాఫిక్స్ ... స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కారణంగా ఆలస్యమౌతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు ముహూర్తపు తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాని జూలై 6 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి  ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అలాంటిది ఆయన ఈ సారి ఏకంగా ప్రయోగమే చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  సమంతా ... నాని ... సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా కోసం, ఇతర భాషలకి చెందిన చిత్ర పరిశ్రమలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ రాజమౌళి చేసిన సినిమాలు ఇతర భాషల్లో ఘన విజయాలు సాధిస్తుండటమే అందుకు కారణం. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా, ఆయనకి ఏ స్థాయి విజయాన్ని కట్టబెడుతుందనేది అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega fance full josh in ram charan wedding reception
Ramchran wedding reception movements  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles