Charan marriage works

charan marriage works

charan marriage works

27.gif

Posted: 06/12/2012 03:45 PM IST
Charan marriage works

       చరణ్-ఉపాసనల పెళ్లి ఏర్పాట్లు నభూతో..నభవిష్యతి అన్న రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 14 న రామ్ చరణ్, ఉపాసనల వివాహాన్ని రాయల్ వెడ్డింగ్ గా జరుపడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.2eసినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు ఎక్కడెక్కడి నుంచో తరలిరానున్నారు. కాగా, చరణ్, ఉపాసనల వివాహ దుస్తులను అదిరిపోయే రీతిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యానీ డిజైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉపాసన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో తెలియజేసింది. తమకు దుస్తులు ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందో తరుణ్ కి బాగా తెలుసనీ, అందుకే అతనికే ఆ బాధ్యతను అప్పజెప్పామనీ ఆమె తెలిపింది. వీరి వివాహ నిశ్చితార్దానికి కూడా అతనే డ్రేసేస్ డిజైన్ చేశాడు. 'అతని డిజైనింగ్ అంటే నాకెంతో ఇష్టం. అతనిలా మరొకరు చేయలేరనేది నా అభిప్రాయం. అందుకే ఆయనకే ఆ బాధ్యత ఇచ్చేశాం' అంటోంది ఉపాసన. అంతేకాదు, చిరు ఫ్యామిలీతోపాటు కామినేని ఫ్యామిలీ మొత్తం పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు.
   2ee మరోవైపు చరణ్ పెళ్లి పనుల్లో మెగా ఫ్యాన్స్ బిజీబిజీ అయిపోయారు. చిరంజీవి ఫ్యామిలీ హీరోల నుంచి కొత్త సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. మరి ఆ ఇంట్లో పెళ్లంటే అభిమానుల స్పందన ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా రామ్ చరణ్ పెళ్లికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, బాసికాలను అభిమానులే తీసుకొస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అభిమానులు రామ్ చరణ్, ఉపాసన వివాహానికి భద్రాచలం సీతారామ కల్యాణానికి ఉపయోగించిన ముత్యాల తలంబ్రాలను తీసుకెళ్తున్నారు. మండపేట నుంచి తెచ్చిన కొబ్బరి బోండాలు, జీలకర్ర, బెల్లం, పట్టువస్త్రాలకు భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమాన హీరోకి అందజేస్తున్నారు. కాగా, ఎల్లుండి ఉదయం ఏడున్నర గంటలకు ఉపాసన మెడలో రామ్ చరణ్ మూడు ముళ్లు వేయనున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Urvasi saradha birthday today
Pawan salman meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles