Great movie batti vikramarka come again

great movie batti vikramarka come again

great movie batti vikramarka come again

13.gif

Posted: 06/06/2012 07:28 PM IST
Great movie batti vikramarka come again

     మహత్తర చిత్ర రాజం మళ్లీ వస్తోంది. దివంగత ఎన్టీ రామారావు నటించిన జానపద చిత్రాల్లో 'భట్టి విక్రమార్క' ముందు వరుసలో ఉంటుంది.  ఇప్పుడీ సినిమాని తిరిగి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.3f ఈ జానపద సినీ రాజాన్ని ఈ తరం ప్రేక్షకులకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో, ఈ సినిమాని తెర కెక్కించడానికి  నిర్మాత యలమంచలి సాయిబాబు ఆసక్తిని చూపిస్తున్నట్లు చెబుతున్నారు. 'శ్రీ రామరాజ్యం' సినిమా సమయంలోనే, మరో సినిమాకి డేట్స్ ఇస్తానని ఆయనకి బాలకృష్ణ  మాట ఇచ్చాడట. దాంతో బాలకృష్ణ హీరోగా ఈ సినిమాని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైనదని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికల సంగతి అటుంచితే, దర్శకుడిగా సూర్య  ప్రకాష్ పేరు వినిపిస్తోంది. రాఘవేంద్ర రావు కొడుకైన సూర్య ప్రకాష్, గతంలో 'అనగనగ ఓ ధీరుడు' వంటి జాన పదాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ, దర్శకుడిగా అతనికి ప్రశంసలు బాగానే దక్కాయి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. ఒకప్పటి అద్భుత కళాకండాన్ని మళ్లీ కొత్త తరహాలో చూసే భాగ్యం కలుగుతుందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Powerstar rare picture
Big thanks for pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles