Super star mahesh babu new entry

super star mahesh babu new entry

super star mahesh babu new entry

9.gif

Posted: 06/06/2012 04:30 PM IST
Super star mahesh babu new entry

     చిన్న పిల్లలు దగ్గర నుంచి ముసలి వాళ్లవరకూ అభిమానించే హీరో మహేష్ బాబు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ధైర్య సాహసాల్లోకూడా మహేష్ స్థానం సుస్థిరం. ఈ విషయం ఎన్నోమార్లు నిరూపితమైంది కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండి యావత్ రాష్ట్రాన్నీ ఏలుతోన్న తరుణంలో.. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు లొంగకుండా తను ఏమనుకున్నాడో అదే చేశాడు ఈ యంగ్ హీరో. చిరు రాజకీయాల్లో అడుగిడిన తరుణంలో పోటీగా మహేష్ ను అప్పటి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గోమని వైఎస్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తలఒగ్గని హీరో మహేష్ బాబు. 5e
   'పోకిరి' సినిమాతో హీరోగా తన సత్తా చాటుకున్న మహేష్ బాబు, 'దూకుడు' ... 'బిజినెస్ మేన్' సినిమాలతో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగాడు. మహేష్ బాబు 'ఓకే' అంటే చాలు అనుకుంటూ ఆయన అంగీకారం కోసం ఎదురు చూసే దర్శక నిర్మాతలు ఎందరో వున్నారు. అయినా ఆచి తూచి కథలను ఎంచుకునే మహేష్, కొత్తగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై నిర్మాతగా కూడా కొనసాగాలన్నదే ఆ నిర్ణయం. గతంలో హీరోగా నిలదొక్కుకున్న కృష్ణ, ఆ తరువాత 'పద్మాలయ స్టూడియోస్' ను స్థాపించి ఆ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన  ప్రయోగాలు చేశారు. ఇప్పుడదే మార్గాన్ని మహేష్ కూడా అనుసరించనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.  సొంత బ్యానర్ ని ఏర్పాటు చేసుకుని ఏడాదికి ఒక సినిమా తీయాలనే ఉద్దేశంతో మహేష్ ఉన్నాడని అంటున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను మహేష్ భార్య నమ్రత దగ్గరుండి చూసుకోనున్నట్టు చెబుతున్నారు. హీరోగా తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న మహేష్, నిర్మాతగా కూడా ఆ విషయాన్ని రూఢీ పరుస్తారేమో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer d rama naidu life thunders
Tara chowdary fixed high rate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles