Between puri and prakash raj

between puri and prakash raj

between puri and prakash raj

35.gif

Posted: 06/05/2012 05:09 PM IST
Between puri and prakash raj

      నేడు తానీ స్థానంలో ఉన్నానంటే దానికి కారణమైన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పదేపదే అంటూ ఉంటారు.pure అలాంటి వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించి బేరం కుదరలేదు.    తెలుగు తెరపై తన దైన ముద్ర వేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. పాత్ర ఏదైనా తన దైన శైలిలో దానిని పండించి ప్రేక్షకులని మెప్పించడం ఆయన ప్రత్యేకత. ఆయన కాంబినేషన్లో నటించడానికి హీరోలు సైతం ఇంట్రస్ట్  చూపిస్తుంటారు. అలాంటి ప్రకాష్ రాజ్, అగ్ర దర్శకుడైన పూరీ జగన్నాథ్ కి షాక్ ఇచ్చాడట. పవన్ కల్యాణ్ హీరోగా పూరీ 'కెమెరా మేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర  విషయంలో ప్రకాష్ రాజ్ ని సంప్రదించిన పూరీ, ఓ 30 రోజులపాటు ఏక ధాటిగా డేట్స్ అవసరమౌతాయని  అడిగాడట.
      దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..  అతి కష్టం మీద డేట్స్ అడ్జెస్ట్  చేస్తానంటూనే, ఈ సినిమాకి గాను తనకి ఎంత పారితోషికాన్ని ఇవ్వాల్సి వస్తుందనేది చెప్పాడు. అగ్ర కథానాయకులు తీసుకునే ఆ 'ఫిగర్' విని పూరీ వులిక్కిపడ్డాడట. అంత మొత్తాన్ని డిమాండ్ చేసే ఆర్టిస్టులు తనకి అవసరం లేదని ఓ దణ్ణం పెట్టేసిన పూరీ, ప్రస్తుతం ఆ కేరక్టర్ కోసం మరో ఆర్టిస్ ని వెతికి పట్టుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కి ప్రత్యామ్నాయం లేదని చెబుతుంటారు. మరి పూరీ ఈసారి చేసే ప్రయత్నంతో ఆ ప్రత్యామ్నాయం దొరకుతుందా.. చూడాలి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh grand heksa platinum disk function
Naga chaitanya forth coming movie autonagar surya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles