దర్శకుడు కోడి రామకృష్ణ కి సినిమాలు తెరక్కించటంలో ఓ ప్రత్యేక స్థానముంది. ఇది అతని ఇంతకుముందు తీసిన సినిమాలు చూస్తే ఇట్టే అవగతమవుతుంది. అయితే.. తాజాగా ఈన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'సత్యసాయి' జీవిత చరిత్రని సాయి మహిమలుతో పాటే, అందులో నటించే తారాగణం గురించి కూడా చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాల సత్య సాయిగా శ్రీజిత్ నటిస్తుండగా, ఆయన తల్లిదండ్రులుగా జయప్రద - శరత్ బాబు కనిపించనున్నారు. ఇక సత్యసాయి కాస్త పెద్దవారైన దగ్గర నుంచి ఆ పాత్రలో మలయాళ నటుడు మోహన్ లాల్ కనిపిస్తారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే ... ఇందులో ఓ కీలకమైన పాత్రని కె.వి రమణాచారి పోషిస్తున్నారు. ఈ సందర్భంగా రమణాచారి ఆనందం వ్యక్తం చేశారు. 'అమ్మోరు' ...
'దేవుళ్ళు' వంటి భక్తి రసాత్మక చిత్రాలను తెరకెక్కించిన కోడి రామకృష్ణ, ఈ సినిమాలో తనకి ఓ ప్రధానమైన పాత్రని ఇవ్వడం ఆనందంగా వుందని చెప్పారు. ఇటీవల 'దేవస్థానం' చిత్రంలో నటించిన తనకి, ఆ వెంటనే ఈ పాత్ర లభించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. పంగిడి గూడెం ... బుట్టాయి గూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ ... పుట్టపర్తి ... ఉత్తరాంచల్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను బహుభాషల్లో నిర్మించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం చాలా క్వాలిటీగా ప్రాజక్ట్ కు రూపురేఖలు అద్దుతున్నట్టు సమాచారం.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more