Darsakendrudu raghavendrarao birth day today

darsakendrudu raghavendrarao birth day today

darsakendrudu raghavendrarao birth day today

27.gif

Posted: 05/23/2012 12:24 PM IST
Darsakendrudu raghavendrarao birth day today

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిన్ అందాలను చూపించడంలో రాఘవేంద్రరావుకు మించిన దర్శకుడు తెలుగులో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. K-Raghavendra-Raoeeపండ్లు, పూలతో హీరోయిన్ అందాలను రంగరించటంలో అతనికతనే సాటి.  పదహారేళ్ల వయసు చిత్రంలో శ్రీదేవిని ఎలా చూపించారో ఆ తర్వాత చాలాకాలానికి శ్రీదేవితో తీసిన వేటగాడు చిత్రంలో కూడా అంతే అందంగా చూపించారీయన. అదే రాఘవేంద్ర ప్రత్యేకత. కేవలం హీరోయిన్ ల అందచందాలకు పరిమితం కాకుండా హీరోలను కూడా వెరైటీ పాత్రల్లో చూపించడం రాఘవేంద్రరావుకే చెల్లింది. మగువల మనసుదోచే నాగార్జునను డీ గ్లామరైజ్డ్ అన్నమయ్య పాత్రలోనూ ఎంతో అద్భుతంగా చూపించగలిగారు రాఘవేంద్రరావు.
balayya-tabueeతెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడుగా పేరు తెచ్చుకున్నారు దర్శకులు కె. రాఘవేంద్రరావు. ఆయన  మే 23, 1942న కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం కొలవెన్ను గ్రామంలో పుట్టారు. 1975లో  శోభన్ బాబు నటించిన బాబు చిత్రంతో కె.రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎంతో మంది హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు రాఘవేంద్రరావు.  తెలుగులో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కనే హీరోలు ఎందరో ఉన్నారు. అంతటి ప్రతిభాశాలి రాఘవేంద్రరావు. తెలుగు చిత్రసీమ గర్వించే దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకరు. తాజాగా నాగార్జునతో కలిసి శిరిడిసాయి చిత్రాన్ని తీస్తున్న రాఘవేంద్రరావు మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుని కళాకండాల వంటి చిత్రాలను అందించాలని ఆంధ్రావిశేష్.కాం ఆకాంక్ష. 

కాగా దర్శకేంద్రుడికి చలన చిత్రరంగానికి చెందిన అల్లు అరవింద్ తదితర ఎందరో ప్రముఖులు ఈ ఉదయం నుంచీ తమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులు, ఫ్రెండ్స్ తరుపునుంచి కూడా రాఘవేంద్రరావుకు గ్రీటింగ్ కార్డ్ రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ కార్డ్ మీకోసం ....

ntr_raghaee

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Popular actor chandramohan birth day story
Ram gopal varma sanjay dutt dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles