చిత్ర నిర్మాణానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. అయినా ఏమాత్రం లెక్కచేయటంలేదు నిర్మాతలు. అయితే ప్రస్తుత ఖర్చు హీరో ఖాతాలోకి పోయింది. తాజాగా అజయ్ దేవగన్ నటిస్తోన్న సినిమా ఖర్చు ఈ బాపతు మాదిరే అవుతుందని తెలుస్తోంది. 'సింగం' సినిమా విజయంతో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మాంఛి ఊపుమీద వున్న అజయ్ ఈ సినిమా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఆయనే స్వయంగా ఓ సినిమాని నిర్మించేందుకు రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో ఆయన పాల్గొంటూనే, నిర్మాణ పరమైన పనులని కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడని అంటున్నారు.
యాక్షన్ సీన్స్ కి పెద్దపీట వేసే అజయ్ తన అభిమానుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ని స్వయంగా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫైట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అజయ్ దేవగణ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ... ఈ పోరాట సన్నివేశం అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో భారీగా ఖర్చు చేయవలసి వచ్చిందనీ, అంతేగాని పబ్లిసిటీ లో ఓ భాగంగా ఈ విషయాన్ని వాడుకునే అవసరం తనకి లేదని సెలవిచ్చాడు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more