Gabbar singh combi again

gabbar singh combi again

gabbar singh combi again

13.gif

Posted: 05/18/2012 07:11 PM IST
Gabbar singh combi again

      పవన్ కెరీర్ లో పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్. తమ కాంబినేషన్ లోనే ఈ సూపర్ హిట్ కొట్టినందుకు బండ్ల గణేష్ ఫుల్ ఖుషిగా ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం పవన్ హీరోగా తీన్ మార్ చిత్రాన్ని నిర్మించాడు బండ్ల గణేష్. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించినప్పటికీ  అంచనాలు అందుకోలేకపోయింది. తీన్ మార్ నిరాశ పరిచినప్పటికీ ఈ కాంబినేషన్ లో రెండో సినిమాగా గబ్బర్ సింగ్ ను చేశారు.eee
      అయితే పవన్ కళ్యాణ్ కీ, బండ్ల గణేష్ కి ఉన్న రిలేషన్ ఈనాటిది కాదు. బండ్ల గణేష్ కమిడియన్ గా ఉన్నప్పటి నుంచే వీరి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. పవన్ సినిమా సుస్వాగతం నుంచే వీరు పరిచయం అయ్యారు. అప్పటినుంచి వారిద్దరి మధ్యా స్నేహ బంధం కొనసాగుతూ వస్తోంది. అయితే.. పదేళ్ల తర్వాత మళ్లీ ఖుషి వంటి హిట్ కొట్టిన పవన్.. గణేష్ కి మరో సినిమా కి డేట్స్ ఇస్తానని చెప్పాడట.  పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఆ చిత్రం చేస్తానని చెప్పారని సమాచారం. నిజానికి గబ్బర్ సింగ్ పవన్ సొంత సినిమానే గణేష్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే.
        హిందీలో వచ్చిన 'దబాంగ్' చిత్రాన్ని 'గబ్బర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి, సంచలన విజయాన్ని సాధించిన నిర్మాత బండ్ల గణేష్, ప్రస్తుతం హిందీలో రూపొందుతున్న 'దబాంగ్' సీక్వెల్ 'దబాంగ్-2' రీమేక్ హక్కుల్ని కూడా తీసుకున్నాడు. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న 'దబాంగ్-2' రీమేక్ చిత్రంలో కూడా gaaafపవన్ కల్యాణ్ హీరోగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగు వచ్చే ఏడాది మార్చి నుంచి జరుగుతుందట. అయితే, దర్శకుడెవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఆ సినిమా పవన్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు  షూటింగ్ పూర్తయ్యాక చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట. ఈ లోగా..కథ, దర్శకుడు పైనలైజ్ అవుతుందని తెలుస్తోంది.
       ఇదిలా ఉంచితే, ప్రస్తుతం శ్రీను వైట్ల, యన్టీఆర్ కాంబినేషన్లో 'బాద్ షా' చిత్రాన్ని నిర్మిస్తున్న బండ్ల గణేష్, మరి కొన్ని క్రేజీ కాంబినేషన్లను సెట్ చేస్తున్నాడు. శ్రీను వైట్ల- పవన్ కల్యాణ్ కాంబినేషన్, రామ్ చరణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్, మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లలో చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే, అల్లు అర్జున్ తో కూడా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kevvu keka song goes to bollywood
Julayi audio release conform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles