Aparichitudu movie combination again

aparichitudu movie combination again .?

aparichitudu movie combination again ..?

25.gif

Posted: 05/14/2012 05:02 PM IST
Aparichitudu movie combination again

       శంకర్ సినిమాలంటే అందరికీ ఆసక్తే.. స్నేహితుడు' తర్వాత శంకర్ చేసే సినిమాలో హీరో ఎవరనే దానిపై రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చెన్నైలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శంకర్ కొత్త సినిమాలో హీరోగా విక్రమ్ ఓకే అయ్యాడని తెలుస్తోంది. గతంలో విక్రమ్ ను అపరిచితుడిని చేసి శంకర్ సెన్సేషనల్ హిట్ ను అందుకున్నాడు.1 విక్రమ్ కు కూడా ఈ మూవీ మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అపరిచితుడు తర్వాత మజా, మల్లన్న, రావన్, నాన్న సినిమాలు నటుడిగా ఈ స్టార్ హీరోకు ప్రశంసలు తెచ్చిపెట్టినా... కమర్షియల్ గా మాత్రం నష్టాలనే మిగిల్చాయి. అంటే శంకర్ తీసిన అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు విక్రమ్.
       అందుకే శంకర్ మరోసారి ఓ డిఫరెంట్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడట. ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక శంకర్-విక్రమ్ కాంబినేషన్లోని ఈ అప్ కమింగ్ సినిమాను పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో శంకర్ గతంలో ‘ఒకేఒక్కడు’ చిత్రాన్ని తీసి సంచలనం సృష్టించాడు. మళ్లీ చాలాకాలం తర్వాత ఆయన మరోసారి రాజకీయాల నేపథ్యంలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు తమిళంలో ‘తేర్‌ధాల్’, తెలుగులో ‘ఎలక్షన్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని వినికిడి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  23gif
Pawan kalyans gabbar singh movie creates new records  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles