Pawan kalyans gabbar singh movie creates new records

pawan kalyan's gabbar singh movie creates new records

pawan kalyan's gabbar singh movie creates new records

7.gif

Posted: 05/14/2012 02:42 PM IST
Pawan kalyans gabbar singh movie creates new records

       పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంపర కొనసాగుతోంది. అమెరికాలో ఈ మూవీ 3 రోజుల కలెక్షన్ 57790 డాలర్లు. అంటే సుమారుగా మూడు కోట్లకు సమానం. ఇంత పెద్దమొత్తంలో వసూలు చేసిన సినిమా ఇంతవరకూ ఏదీ లేకపోవటం గమనార్హం.gafffffffffffఈ మూవీ అమెరికాలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్.. రణ్ బీర్.. రాక్ స్టార్, అక్షయ్.. దేశీ బాయ్స్., ఇమ్రాన్స్..ఎమేట్., ఇంకా సైఫ్.. ఏజెంట్ వినోద్ వంటి చిత్రాలను మించి ఓపెనింగ్స్ రాబడుతోందని కొన్ని నిమిషాల క్రితం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వట్టర్ సందేశంలో పేర్కొన్నాడు.
       అంతేకాదు విడుదలైన ప్రతి చోటా ఈ సినిమా ఇప్పటివరకూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. శని, ఆది వారాల్లో సినిమా చూద్దామనుకున్న ఎన్నో ప్యామిలీస్ టికెట్స్ దొరక్క వెనుదిరిగిన సందర్భాలు దాదాపు ప్రతి థియేటర్ వద్దా కానవచ్చాయని సమాచారం. మొదటి రోజు ఈ చిత్రం తూర్పుగోదావరి జిల్లాలో 83 లక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో 53 లక్షలు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో ఈ చిత్రం 53 లక్షలు వసూళ్లు రాబట్టింది. రెండవ రోజు వసూళ్ళ వివరాలు (షేర్) : తూర్పు గోదావరి – 23 లక్షలు
పశ్చిమ గోదావరి – 23 లక్షలు, వైజాగ్ – 32 లక్షలు
      ఇంక సీడెడ్ విషయానికొస్తే..ఈ చిత్రం మొదటి రోజు సీడెడ్ లో 1.7 కోట్లు వసూలు చేసింది. రెండు రోజుల్లో 2.3 కోట్లు వసూలు చేసింది. ఇంకా  గుంటూరు – 37 లక్షలు, కృష్ణా – 25 లక్షలు, నెల్లూరు – 15 లక్షలు వసూలయ్యయి. తాజాగా ఈ చిత్రం తిరుపతి టౌన్ రికార్డ్ ని బద్దలు కొట్టింది. ఈ చిత్రం రెండు రోజుల్లు తిరుపతి టౌన్ మాత్రమే 21 లక్షలు వసూలు చేసి రికార్డ్ నెలకొల్పింది.
       ప్రక్క రాష్ట్ర మైన తమిళనాడులో కూడా ఈమూవీ భారీ కలెక్షన్లను రాబడుతోంది. ముంబై మీడియా ఈ చిత్రం ప్రముఖ బాలివుడ్ చిత్రాల కన్నా అమెరికాలో ఎక్కువ వ్యాపారం చేసినట్టు ప్రకటించింది. బాలివుడ్ చిత్రాల థియేటర్లలో మూడో వంతు థియేటర్లలో విడుదలయినా కానీ,  ఎక్కువ కలెక్షన్లను రాబట్టిందని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. “దూకుడు” చిత్రం కంటే ఎక్కువ పరిధిలో ఈ చిత్రానికి కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి.  తమిళనాడు లో ఈ చిత్రం 25 స్క్రీన్లలో విడుదల కాగా ఎక్కడ కలెక్షన్లు డ్రాప్ కాలేదు. ఒక తెలుగు చిత్రానికి ఇది అద్బుతమయిన ఓపెనింగ్ అని తమిళ సినీ పరిశ్రమ, మీడియా కోడై కూస్తోంది. మొత్తంగా సినీ ప్రేక్షకులు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన సంచలన విజయం పవన్ ను ఇన్నాళ్లకి వరించిందన్నమాట. 

( కొద్ది సేపటిక్రితం అందిన తాజా సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ మూడు రోజుల షేర్ : (కోట్లలో) నైజాం : 5.8..., క్రిష్ణా : 1.17..., గుంటూరు: 1.92.., సీడెడ్ : 3.58..., ఈస్ట్ గోదావరి : 1.19...., వెస్ట్ గోదావరి : 1.19...,  నెల్లూర్ : 72 లక్షలు..., )

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aparichitudu movie combination again
Dasari congrats to gabbar singh director harish shankar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles