Kala wachaspathi award for mohan babu

kala wachaspathi award for mohan babu

kala wachaspathi award for mohan babu

13.gif

Posted: 05/07/2012 03:56 PM IST
Kala wachaspathi award for mohan babu

      టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ నెల్లూరు శాఖ ప్రారంభాన్ని పురస్కరించుకుని సినీనటుడు మోహన్‌బాబుకు నట వాచస్పతి బిరుదును ప్రదానం చేశారు.tsrssff నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడుతో పాటు, సినీరంగ ప్రముఖులు మురళీమోహన్, బ్రహ్మానందం, వాణిశ్రీ, జీవిత రాజశేఖర్, అలీ, తనికెళ్ల భరణి, శ్రద్దాదాస్, అర్చన, దీక్షాసేథ్,పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, కోడి రామకృష్ణ, మోహన్‌బాబు కుమార్తె, నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. ఇంకా.. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, చింతామోహన్, హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్త మాడుగుల నాగఫణిశర్మ తదితరులు కూడా హాజరయ్యారు.  పలువురు సినీనటులను కూడా ఈ కార్యక్రమంలో సన్మానించారు. బిరుదు ప్రదానంపై నటుడు మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశారు.సినీ గాయకులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
       అయితే విమర్శకులు మాత్రం టీఎస్సార్ అవార్డుల మీద పెదవి విరుస్తున్నారు. బాగా డబ్బున్న.. పేరున్న కళాకారులకే టి సుబ్బిరామిరెడ్డి అవార్డులు.. కత్తులు..బాకులు.. ప్రదానాలు చేస్తారని ఆయనకు పేద కళాకారులు కనిపించరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitin dance in gabbar singh
Ram charan compliments devi sri prasad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles