Ram charan compliments devi sri prasad

ram charan compliments devi sri prasad

ram charan compliments devi sri prasad

5.gif

Posted: 05/07/2012 02:37 PM IST
Ram charan compliments devi sri prasad

      chery_sri తండ్రి వినియ విధేయతలను అక్షరాలా అందిపుచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదే శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఎవరినీ తూలనాడక, అందరినీ కలుపుకుపోతూ కథం తొక్కుతున్నాడు.  మొన్న ‘దమ్ము’ సినిమా సందర్భంలో ఎన్టీఆర్ నటన మీద కాంప్లిమెంట్ కురిపించి మూవీ రిలీజ్ రోజు చరణ్ విషస్ తెలిపిన సంగతి తెలిసిందే.  తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి కూడా చెర్రీ అలాంటి కాంప్లిమెంటు ఇచ్చాడు. తన దృష్టిలో దేవిశ్రీ 'ది కింగ్ ఆఫ్ ఐటమ్స్' అంటూ మనసులో మాట బయటపెట్టాడు.
       ప్రస్తుతం తను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న 'ఎవడు' `చిత్రానికి దేవీ అద్భుతమైన ఐటెం నంబర్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ పాటను హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. పక్కా మాసీగా వున్న ఈ ఐటంసాంగ్ చరణ్ ని విపరీతంగా ఆకట్టుకుందట. తన చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని చరణ్ అంటున్నాడు. ఈ ఐటంసాంగు తనకే కాకుండా తన అభిమానులకి కూడా బాగా నచ్చుతుందని చరణ్ అంటున్నాడు. అంతేకాదు, ఇంతవరకూ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఐటంసాంగ్స్ లో కెల్లా నంబర్ 1 గా నిలుస్తుందంటున్నాడు. ఈ పలుకులు ఈ ఐటెం సాంగ్ మీద విపరీతమైన క్రేజ్ ని నెలకొల్పుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kala wachaspathi award for mohan babu
Ntr movie badshaa music sittings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles