Charan upasana marriage venue may be n convention hyderabad

charan upasana marriage venue may be n convention hyderabad..

charan upasana marriage venue may be n convention hyderabad..

20.gif

Posted: 04/26/2012 12:26 PM IST
Charan upasana marriage venue may be n convention hyderabad

               ఎంతోకాలంగా మెగా అభిమానులంతా ఎదురుచూస్తోన్న కళ్లాణ వైభోగం త్వరలోనే సాక్షాత్కరించబోతోంది.  రాజ్యసభ సభ్యులు.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్‌తేజ్, అపోలో ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలు ఉపాసనల వివాహం జూన్ 14 న హైదరాబాద్‌లో జరగనుంది. (వివిధ మీడియాలో చాలా చోట్ల ఈ తేదీని 12వ తేదీ అని తప్పుగా వెల్లడిస్తున్నారు.) వివాహ మహూర్తం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు. ఈ మేరకు వధూవరుల కుటుంబాలు ముహుర్తాన్ని ఖాయం చేశాయి. రాత్రే పెండ్లి కుమార్తె ఇంట్లో ఇరు కుటుంభాల పెద్దలు పండితుల సమక్షంలో  లగ్నపత్రిక వ్రాసుకున్నారు. ramcharan-pratapreddy_inn
                  తాజాగా కళ్యాణ వేదిక విషయం లోకూడా స్పష్టత వచ్చింది. హైటెక్స్‌లో లేదా శిల్పారామం ఎదురుగా ఉన్న ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరిగే అవకాశాలున్నాయని తొలుత భావించినప్పటికీ కొద్దిసేపటిక్రితమే వేదిక ఖరారైంది. రామ్ చరణ్ – ఉపాసన వివాహం హైదరాబాద్ గండిపేట ఫాం హౌస్ లో జరుగనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆంధ్రావిశేష్.కాం కు సమాచారం అందింది.
                  మే నెల మొదటివారంలో ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖల ముద్రణ పూర్తవుతుందని వెల్లడి. ఈ వివాహాన్ని నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటలో చేయాలని ప్రతాప్‌రెడ్డి కుటుంబం భావించినా.. సౌకర్యాలలేమి, అభిమానుల తాకిడి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. అయితే, పెళ్లికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తానికి చిరు అభిమానులంతా తమ ఇంట్లో పెళ్లిలా భావిస్తోన్న భారీ వివాహ వైభోగం అతిత్వరలోనే కనుల పండుగ చేయబోతోందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger ntr dammu release in a few hours
Charan upasana marriage date and time venue fixed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles