మన ప్రిన్స్ మహేష్ బాబు ఉత్తరప్రదేశ్ లోని అహ్మదాబాద్ లో యమ బిజీగా గుడుపుతున్నారు. పనేమిటో అంటారా.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరుగుతోంది. గత రెండు రోజులుగా ఇక్కడ మహేష్ బాబు కి సంబంధించిన ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమా షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
దాదాపు వారం తరువాత వెంకటేష్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను - పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. వెంకటేష్ - మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తోన్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలాకాలం తరువాత బంధాలు, అనుబంధాల నేపథ్యంలో వస్తోన్న ఈ కుటుంబ కథా చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.
వెంకటేష్ సరసన అంజలి - మహేష్ బాబు జోడీగా సమంతా కనువిందు చేయనున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు విక్టరీ వెంకీ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ చాలా ఆహ్లాదబరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
....avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more