Bollywood actress deepika padukone make a another south indian movie

bollywood actress deepika padukone make a another south indian movie

bollywood actress deepika padukone make a another south indian movie

10.gif

Posted: 04/12/2012 05:05 PM IST
Bollywood actress deepika padukone make a another south indian movie

                        dee_inn111 మరో క్రేజీ కాంబినేషన్ త్వరలో తెరపై సాక్షాత్కరించబోతోంది. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించబోయే ఓ చిత్రం లో బాలీవుడ్ అందాల భామ దీపికాపదుకునే ప్రధాన భూమిక పోషించబోతుందని తెలుస్తోంది. దీపికా ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా ‘కొచ్చాడయాన్’ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.  అనంతరం ఈ కొత్త ప్రాజక్ట్ కు దీపిక పనిచేస్తారని సమాచారం.  శంకర్ స్థాయికి తగ్గట్టుగా అద్భుతం అనిపించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది.  పైగా ఇది ‘జీన్స్’ మాదిరిగా హీరోయిన్ చుట్టూ తిరిగే కథాంశమట. అందుకే హీరో కంటే ముందు హీరోయిన్‌ని ఎంపిక చేశారట శంకర్. ఇక ఇందులో హీరో పాత్రకు విజయ్, సూర్యల పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.
                 ఇదిలాఉండగా,  ఆరేళ్ల క్రితం ‘ఐశ్వర్య’ అనే కన్నడ సినిమాతో నటిగా మారారు దీపికా పదుకొనే. ఆ సినిమాను మినహాయించి ఇక ఏ సౌత్ సినిమాలోనూ దీపికా నటించలేదు. అయినా, ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిన ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీపిక నటిస్తాననాలే కానీ, ఫ్యాన్సీ ఆఫర్లతో ముందుకొచ్చే నిర్మాతలు దక్షిణాది కోకొల్లలు.  కానీ దీపిక మాత్రం ఇప్పటివరకూ సౌత్ సినిమాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు.. అయితే..ఇప్పుడు ఈ అందాల భామ దక్షిణాదికి మగ్గుచూపుతుంది. ఆనందకరమేకదా..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh shooting seens
Eerojullo hero srinivas get another chance to act as a hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles