Balayya babu adhinayakudu movie release

balayya babu adhinayakudu movie release..

balayya babu adhinayakudu movie release..

2.gif

Posted: 04/11/2012 01:21 PM IST
Balayya babu adhinayakudu movie release

              Balakrishna-Adhinayakudu_inner 'అధినాయకుడు' మడమతిప్పాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మళ్లీ వెనుకంజ వేస్తున్నాడు. దీంతో బాలయ్యబాబును సరికొత్త రూపాల్లో చూడవచ్చను కున్న అభిమానుల ఆశలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఫ్యాన్స్ ఒకింత అసహనానికి గురవుతున్నారు.  ఇంతకుముందు ఈ  సినిమాని ఈ నెల 13 న విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఈ విషయం పట్ల దర్శక నిర్మాతలు స్పందిస్తూ, ఈ సినిమా విడుదల వాయిదాపడిన విషయం నిజమేననీ ... తిరిగి ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలో ప్రకటిస్తామని చెబుతున్నారు.
             నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎ సర్టిఫికేట్ దక్కించుకున్నప్పటికినీ ఆర్థిక ఇబ్బందుల కారణం గా ఈ మూవీ రిలీజ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చిత్ర నిర్మాత ఎమ్ఎల్ కుమార్ చౌదరి ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కోవడంతో ఈ సినిమా ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  
           సలోని,  లక్ష్మి రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు.  బాలకృష్ణ పోషించిన మూడు విభిన్నమైన పాత్రల కోసం ... లక్ష్మీరాయ్ - సలోని అందచందాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులని ఈ సినిమా ఎప్పుడు కరుణిస్తుందో మరి.  కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకుడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine sradhaa das movie chance missing
Ram charan rachha movie creates new recoreds  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles