Producer natti kumar critisise 3 movie starer

producer natti kumar critisise 3 movie starer

producer natti kumar critisise 3 movie starer

1.gif

Posted: 04/09/2012 03:15 PM IST
Producer natti kumar critisise 3 movie starer

             natti_inn_1st హాయ్..దిస్.. కొలవెరి.. కొలవెర్రీ ఢీ.. అంటూ '3' సినిమాలో పాట పాడితే ఆ పాటకు వచ్చిన మూడ్‌తో యువతలో క్రేజీ ఏర్పడడం... ఆ సినిమా తీసిన వారికి ఆదాయం రావడం జరిగిపోయింది. ఆ చిత్రాన్ని ఇటు తెలుగులో నట్టికుమార్‌, కన్నడలో మరోవ్యక్తి విడుదల చేశారు. ఓపెనింగ్స్‌ బాగా వచ్చినా తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. చిత్రాన్నికొన్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తెగ ఇబ్బందిపడుతున్నారు. నటీనటుల్ని ప్రమోషన్‌కు తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇదే ఇప్పడు పెద్ద తలనొప్పిగా మారింది. dhanush_3333
                దీనిపై నిర్మాత నట్టికుమార్‌ తన మనసులో మాట బయటపెట్టారు. ‘‘ '3' సినిమాను కొనడానికి ముందు చాలామంది ఒక్కపాటతో వేలం'వెర్రి'గా పెద్ద ఆఫర్‌ ఇచ్చి కొంటున్నావ్‌ జాగ్రత్త అన్నారు. కానీ సినిమాపై నమ్మకంతో నేను కొన్నాను. అయితే రిలీజ్‌ తర్వాత ఆర్టిస్టులతో ప్రమోషన్‌ చేయవచ్చునని అనుకున్నాను. రజనీకాంత్‌ కుమార్తెగా ఐశ్వర్య ధనుష్‌ అద్భుతంగా తీశారు. కస్తూరిరాజా, విమలాదేవి కూడా మంచి సపోర్ట్‌ ఇచ్చారు. కానీ సినిమా విడుదల తర్వాత ప్రమోషన్‌కు రమ్మంటే, ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే 10 రోజులయింది. వారి నుంచి ఏమాత్రం స్పందనలేదు. కర్నాటకలో 3కోట్లతో ఆ సిని మాను కొని రిలీజ్‌ చేస్తే, అది 70లక్షలు వసూలు చేసింది. ఆంధ్రలో కూడా నా పరిస్థితి అలానే వుంది’’.
                ఇదీ..‘3’ మూవీ తెలుగు హక్కులు కొన్న నట్టికుమార్ ఆవేదన.  కాస్త ప్రమోషన్‌కు సహకరిస్తే, డిస్ట్రిబ్యూటర్లు కూడా హ్యాపీగా ఫీలవుతారు. అదికాకుండా సమాధానం చెప్పక పోవడంతో వీరిని ఎలా దారికి తేవాలో పాలుపోవటంలేదని నట్టి వాపోయారు.  ఇకపై అగ్రిమెంట్‌లో ఆర్టిస్టుల ప్రమోషన్‌ కూడా రాసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి ఇండస్ట్రీకి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Music show on may 26th in hyderabad
Rajamouli eega hal chal in social network sites  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles