State wide rachha movie hal chal in all the cities and towns

state wide rachha movie hal chal in all the cities and towns

state wide rachha movie hal chal in all the cities and towns

20.gif

Posted: 04/05/2012 10:13 PM IST
State wide rachha movie hal chal in all the cities and towns

            ram_1మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ “రచ్చ” ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల రేపే.. అనే ఉత్సాహం మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లోనూ నిన్నటినుంచే మొదలైంది. ఫలితంగా ఈ ఉదయం నుంచే భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఆయా సినిమా థియేటర్ల వద్ద క్యూకట్టారు. రాష్ట్రవ్యాప్తంగా, విడుదలైన అన్ని థియేటర్ల వద్ద జనం తండోపతండాలుగా  వచ్చి తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు పోటీపడ్డారు. సినిమా పూర్తిస్థాయి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండటంతో అన్ని సినిమా హాల్స్ లోనూ ఈలలు, కేరింతలు.. సినిమా పూర్తయ్యాక, థియేటర్ల నుంచి బయటకు వచ్చి రచ్చ రచ్చ.. రామ్ చరణ్ జిందాబాద్.. అంటూ అభిమానులు, ప్రేక్షకులు కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా అందుతున్నాయి. 
             కాగా,  రామ్ చరణ్ నటించిన 'రచ్చ' సినిమా విడుదల సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున ధియేటర్లకు తరలి రావడంతో బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే వాళ్ల పంట పండింది. కొన్ని చోట్ల దియేటర్ యాజమాన్యాలే తమ మనుషుల చేత బ్లాక్ లో టికెట్లు అమ్మించినట్టు వార్తలు వినిపించాయి. ప్రదేశాన్ని బట్టి ఒక్కో టికెట్టు 500 నుంచి 1000 రూపాయల వరకు అమ్మకాలు సాగినట్టు సమాచారం. rachha_2
             సినిమాలకు అతికీలక ప్రాంతమైన హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ఇదే సీన్ నడిచింది. ఈ వ్యవహారమంతా పోలీసుల కళ్ళెదుటే జరుగుతున్నా, తమకేమీ పట్టనట్టు పోలీసులు వ్యవహరించడం కనిపించింది. కొన్ని చోట్ల పోలీసులు థియేటర్ వాళ్లతో లాలూచీపడి, ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. కొన్ని ఊళ్లలో టిక్కెట్లు దొరకని మెగా అభిమానులు థియేటర్ యాజమాన్యాలను నిలదీయడంతో తప్పని పరిస్థితుల్లో టిక్కెట్లను సక్రమంగా అమ్మించిన సందర్భాలు దాదాపు చాలా సినిమా హాల్స్ వద్ద కనిపించాయని వార్తలందాయి.rachha_44
            ఇప్పటి దాకా మూడు చిత్రాలతోనే అలరించిన రామ్‌చరణ్‌ తన నాలుగో చిత్రంతో థియేటర్ల వద్ద  'రచ్చ' రచ్చ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం విడుదల కానన్ని థియేటర్స్‌ లో రచ్చ రిలీజ్ అయింది.  ఒక్క నైజామ్‌ ఏరియాలోనే ఈ సినిమా 260 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో 'రగలై' పేరుతోనూ, మలయాళంలో 'రక్ష' టైటిల్‌తోనూ ఒకే రోజున విడుదల అయ్యాయి. మూడు భాషల్లోనూ మొత్తం 1500 ప్రింట్లతో 2400 థియేటర్లలో ఈ చిత్రం 'రచ్చ' చేస్తోంది.raa666
            అంతేకాదు.. రచ్చ సినిమా రిలీజ్ కోసం ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, తణుకు, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, వరంగల్ సహా అన్ని నగరాలు, పట్టణాలు, చిన్న ఊర్లలో కూడా  జనం థియేటర్ల వద్ద బారులు తీరారు. ముందు రాత్రి నుంచే క్యూ కట్టిన అభిమానులు ఉదయం షో చూసి. కేరింతలు కొట్టారు. మరో రికార్డు బ్రేకింగ్ మూవీ అవుతుందంటూ అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకొచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ని మరో కోణంలో చూసామంటూ కితాబిచ్చారు.
            రాంచరణ్ నటించిన సినిమా రిలీజ్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అభిమానులు రచ్చరచ్చ చేశారు. సినిమా కొద్ది సేపు ఆలస్యంగా ప్రారంభమైనందుకు ఆగ్రహించిన అభిమానులు పాలకొల్లులోని ప్రముఖ దర్శకుడు దాసరి థియేటర్‌పై దాడి చేశారు. అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు కూడా వారిని అదుపుచేయలేకపోయారు.charan_chiru_car
            మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు రచ్చ చిత్రం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.  రాంచరణ్ నటించిన రచ్చ సినిమా సూపర్ డూపర్ హిట్‌ అన్నారు చిరంజీవి. సినీ ఇండ్రస్ట్రీలో గత రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమన్నారు. కొడుకు సినిమా హిట్‌తో ఫుల్‌ జోష్‌గా చిరు కనిపించారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా దాదాపుగా ఇవాళ రచ్చ సినిమా తిలకించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమా చాలా బావుందంటూ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం నుంచే మెగా పవర్ స్టార్ కు పలువురి ప్రముఖులు అభిమానుల నుంచి ట్వట్టర్ తోపాటు పలు సోషల్ నెట్ వర్స్క్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
            ఇవాళ జగ్జీవన్ రాం పుట్టినరోజు కావున జాతీయ సెలవు ఉండటం,  ఇదే కాకుండా ఈ వారాంతం లో చాలా సెలవులు రావటం ఈ సినిమా కలెక్షన్లు సరికొత్త రికార్డులు నెలకొల్పటంలో ఆశ్చర్యం లేదని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. శుక్రవారం కూడా “గుడ్ ఫ్రైడే” సందర్భంగా సెలవు.  ఇంకా ఈ చిత్రంతో పాటు పెద్ద చిత్రాలు ఏది విడుదల కాకపోవటం చూస్తుంటే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావటంతో పాటు పాత రికార్డులు బ్రేక్ అయ్యే సూచనలు మొండుకా కనిపిస్తున్నాయి.
            సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan rachha success story
Yangri hero rajashekar movie arjuna shooting coming to an end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles