Big b amitab bachhan says

big b, amitab bachhan, says

big b amitab bachhan says

20.gif

Posted: 03/19/2012 06:03 PM IST
Big b amitab bachhan says

           bachchanఇటీవల కాలంలో ఆరోగ్య అనుకూలించక, ఆస్పత్రిలో గడిపిన బిగ్ బి, ఇప్పుడు యథాస్థితికి చేరుకున్నారు. హుషారుగా పనిచేసుకుంటున్నారు.  కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ ప్రారంభోత్సవాలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొంటానని సమాచార మిచ్చారు.
            ఏప్రిల్ మూడో తేదీన ఐపీఎల్ ఐదో సీజన్ ప్రారంభోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో. ఆసియా కప్ తర్వాత జరిగే ఐపీఎల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ట్విట్టర్లో తెలియజేశారు. ఐపీఎల్‌కు సంబంధించిన జట్లను, కెప్టెన్లను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
            కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవాల్లో అమితాబ్ పాలుపంచుకునే అవకాశం ఉందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ షా కూడా నిర్ధారించారు. మొత్తానికి బిగ్ బి రాకతో ఈ ఐపిఎల్ సీజన్ సరికొత్త శోభను సంతరించుకోబోతుందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kandireeka movie sequel coming up
Action king arjun and mammootty new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles