ఈ వేసవి అంతా రచ్చ రచ్చే.. అందులో డౌటే లేదంటున్నాయి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రచ్చ’ చిత్రవర్గాలు. రిలీజ్ కు ముందు నుంచే పలు అంశాల్లో తన ఆధిపత్యాన్ని చాటుతోన్న ఈ మూవీ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.
వ్యయప్రయాసలకు ఏమాత్రం లెక్కచేయక నిర్మిస్తోన్న ఈ మూవీ, హీరో రామ్ చరణ్ రెమ్మునరేషన్ కాకుండానే 30 కోట్లకు పైగా చేరిందని తాజా సమాచారం. పలు అద్భుతమయిన ప్రదేశాలలో వినూత్న మైన ఫైట్ సన్నివేశాలకు ఈ చిత్రంలో కొదవలేదు.
అటు వ్యాపార పరంగా ‘రచ్చ’ సినిమా రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. విశ్వసనీయ వర్గాల వారి సమాచారం ప్రకారం ఈ చిత్ర అమెరికా పంపిణీ హక్కులు 2 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే రాంచరణ్ తండ్రిగా తమిళ నటుడు, దర్శకుడు పార్తీపన్ (నటి సీత మాజీ భర్త) నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో ఆయన రాంచరణ్ తండ్రిగా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ముఖేష్ రుషి, రవిబాబుతో పాటు ఇంకా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు అమీర్ అజ్మల్ మరో విలన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.
మరో ఆసక్తికర సంగతి ఏమంటే, ‘రచ్చ’ ఆడియో వేడుక పబ్లిక్ లో జరపటం. అంతేకాదు మార్చి 4న కర్నూలులోని ఎస్.టి.బి.బి.సి. కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ భారీస్థాయి వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సన్షేషనల్ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొనబోవటం. ఈ భారీ ఈవెంట్ లో అనేక సూపర్ ఫెర్ఫార్మెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘అదుర్స్’ రియాలిటీ షోలో ప్రదర్శన ఇచ్చే ప్రముఖ బీర్ కల్స గ్రూప్, వళ్లు గగుర్పాటు చెందే అద్భుత ప్రదర్శన ఇచ్చి భారీ సంఖ్యలో తరలివచ్చే మెగా అభిమానులకు కనువిందు చేయబోతుంది.
అటు ఇంటర్నెట్ పైరసీ మీదా ‘రచ్చ’ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ సినిమా ఆడియో హక్కులను కోటి రూపాయాలకు ఆదిత్య సంస్థ సొంతం చేసుకున్నప్పటికినీ కొన్ని రోజుల క్రితం రచ్చ టైటిల్ సాంగ్ ఇంటర్నెట్ లో దర్శనం ఇచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ల ద్వారా బాగా ప్రాచుర్యం పొందిందికూడా. దీనిపై యాంటి పైరసీ బృందం స్పందించింది. ఆ పాటను ఇంటర్నెట్ లో పెట్టిన వారిని అరెస్ట్ చేసి ఆ పాటని ఇంటర్నెట్ నుండి తీయించింది. రాంచరణ్ తో తొలిసారి జత కడుతోన్న తమన్నా ఈ సినిమాలో చాలా రొమాంటిక్ గా కనిపించబోతోందట. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ 'గ్యాంగ్ లీడర్' లోని 'వానా వానా వెల్లువాయే' పాట రీమిక్స్ ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
'ఏమైంది ఈ వేళ'తో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సంపత్‌నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రచ్చ’ సినిమాని మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు నిర్మిస్తున్నారు. మార్చి 4న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేయబోతున్న ఈ సినిమాకు ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సమర్పణ: ఆర్.బి.చౌదరి.
మొత్తంగా రచ్చ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో వెండి తెరలను తాకబోతోంది. ఆల్ ది బెస్ట్ ‘రచ్చ’ టీం..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more