Hero gopichand would be father in law commit suicide

hero gopichand would be father in law commit suicide

hero gopichand would be father in law commit suicide

2.gif

Posted: 02/20/2012 12:35 PM IST
Hero gopichand would be father in law commit suicide

gopichand_innహీరో గోపీచంద్ కు పెళ్లి కుదిరిన సంగతి, మెన్ననే అది రద్ధయిన సంగతి మనకు తెలుసు. అయితే ఈ పరిణామాలు చాలా దారుణానికి దారితీసాయి. ఈ ఉపద్రవాన్ని జీర్ణించుకోలేని పెళ్లి కూతురు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్లుడు పేరున్న సినీ హీరో అని సంబరపడ్డ ఆయనకు కారణాలేవైనా.. మరికొద్ది రోజుల్లో జరగాల్సిన కూతురి పెళ్లి రద్దయిపోవడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో నిండు ప్రాణాలు వదిలేశాడు.

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ వ్యాపార సంఘాల ప్రధాన కార్యదర్శి వి.రాంబాబు (59) ఆదివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరుకు చెందిన ఆయన కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన రెండో కూతురు హరితకు సినీహీరో గోపీచంద్‌తో జనవరి 26న నిశ్చితార్థం జరిగింది. అనివార్య కారణాల వల్ల వివాహం రద్దయింది.

ఈ ఘటనతో రాంబాబు ఆదివారం సాయంత్రం పడకగదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సందేహం వచ్చి చూడగా.. అపస్మారకస్థితిలో ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ద్రువీకరించారు. ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. ఈ దుర్ఘటన వారి బంధుమిత్రులతో పాటు అందరినీ కలచివేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madalasa sharma hot picture
Ram latest movie with bommrillu bhaskar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles