Deepika to be rajini heroine in kochadaiyaan

Deepika, Padukone, Rajinikanth, Kochadaiyaan, leading, lady, Heroine, katrina, kaif, Bollywood,Deepika, Padukone, Rajinikanth, Kochadaiyaan, leading, lady, Heroine, katrina, kaif, Bollywood

There were rumours about Katrina Kaif playing the lead opposite Rajinikanth in Kochadaiyaan, but now it looks like Deepika Padukone has been finalised to pla

Deepika to be Rajini heroine in Kochadaiyaan.GIF

Posted: 02/08/2012 08:54 PM IST
Deepika to be rajini heroine in kochadaiyaan

deepika-padukone

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కొచ్చడయ్యాన్ చిత్రంలో ఎట్టకేలకు హీరోయన్ కన్ ఫార్మ్ అయ్యింది. అంతకు పలుతారల పేర్లు తెరమీదకు వచ్చినా చివరకు ఆ అవకాశాన్ని బాలీవుడ్ నటి దీపికా పదుకునే దక్కించుకుంది. ఈ సినిమాలో రజనీకి జోడిగా కత్రినాకైఫ్‌ నటిస్తుందని నిన్న మొన్నటి వరకూ వార్తలు కూడా వెలువడ్డాయి కూడా. దీపికా పేరు ఖరారు కావటంతో ఇక ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఈ విషయాన్ని దర్శకురాలు సౌందర్య అధికారికంగా ధ్రువికరించింది.

రజనీ కొత్త సినిమాతో రయ్య్‌మంటూ దూసుకొచ్చేస్తున్నారు.. అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఫుల్‌జోష్‌తో ఉన్న సూపర్‌స్టార్‌  త్రీడీ చిత్రం కొచ్చడయ్యాన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రళయ తాండవరూపంలో ఉన్న రజనీ స్టిల్‌ దుమ్మురేపేలా ఉంది. అప్పుడే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి.

కొచ్చాడయాన్ కి ముందు రజనీకాంత్ 'రాణా' చేయాలనుకున్న విషయం తెలిసిందే. కేఎస్ రవికుమార్ దర్శకుడిగా, దీపికా పదుకొనే కథానాయికగా ఈ సినిమా రూపొందాల్సింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే. రజనీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. తర్వాత కొంత విరామం తీసుకొని 'కొచ్చడయ్యాన్' లో నటించడానికి రజనీకాంత్ సిద్ధమయ్యారు.

ఈరాస్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ మీడియా వన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తోంది. సంగీత మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నాడు. శరత్‌కుమార్‌, ఆది, జాకీష్రాప్‌, స్నేహ,శోభన, నాజర్‌ వంటి భారీ తారాగణమే నటిస్తోంది. పూర్తిగా మోషన్‌ కాప్చర్‌లో త్రీడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan
Prakash rajs dhoni movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles