Director shankar and kamal hassan new movie

director shankar and kamal hassan new movie will start in a few months

director shankar and kamal hassan new movie

13.gif

Posted: 02/03/2012 06:48 PM IST
Director shankar and kamal hassan new movie

         bharateeyudu భారతీయుడు వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన క్రేజీ కాంబినేషన్ కమల్ హాసన్ – శంకర్. ఈ గొప్ప దర్శక, నటుల నుంచి మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది.  1996లో వచ్చిన అప్పటి భారతీయుడు చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఎంతటి సంచలనాన్ని సాధించిందో మనకు తెలుసు.
         kamal_hassan ఆస్కార్ రవి చంద్రన్ నిర్మిస్తున చిత్రం లో కమల్ హాసన్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించబోతున్నారని తాజా సమాచారం. ఈ చిత్రానికి ‘తలైవన్ ఇరుక్కిన్ద్రాన్’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
          shankar ఈ సినిమాలో ఎవరు ముఖ్య నటులు అన్నది ఇంకా తేలకపోయినా, జాకి చాన్, చాకులాంటి సుందరి కత్రిన కైఫ్ ఇందులో నటించవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా తమిళ, తెలుగు ఇంకా, హిందీ బాషలలో ఈ చిత్రం ఉండవచ్చని సమాచారం. 
          ‘భారతీయుడు’ సినిమాలో అద్భుత నటనకు కమల్ హాసన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది. అంతేకాదు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తోపాటు, తమిళనాడు ప్రభుత్వమిచ్చే ఉత్తమ నటుడి అవార్డు కూడా కమల్ సొంతమైంది. ఇక ఇప్పుడు సంచలన దర్శకుడు శంకర్,.. కమల్ కు ఇంకెన్ని వరాలు కురిపిస్తాడో వేచిచూడాలి.


.....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deewana director raj kanwar passes away
Heroine samanta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles