Mega power star ram charan tej

mega power star ,ram charan tej ,marriage, date, announced., it will be on june of this year

mega power star ram charan tej marriage date announced. it will be on june of this year

15.gif

Posted: 01/31/2012 05:55 PM IST
Mega power star ram charan tej

              apolo అత్యంత భారీగా జరుగబోయే వివాహ వేడుకగా చెప్పుకుంటోన్నపెళ్లి ఇది.. మెగాస్టార్ చిరంజీవి ఏకైక తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు ఉపాసనల పెళ్లి... ఈ యువజంట ఒక్కటయ్యే వివాహ శుభకార్య తేదీ వెల్లడైంది. జూన్ నెలలో చరణ్-ఉపాసనల పెళ్లి జరుగనుంది. ఈ విషయాన్ని స్వయానా, ఉపాసన తాత, ప్రతాప్ సి రెడ్డి తిరుమలలో మీడియాకు వెల్లడించారు.

           ram_upaప్రతాప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఆయన ముచ్చటించారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయనీ, చరణ్, ఉపాసన జంట చూడచక్కని జంట అని ఆయన మెచ్చుకున్నారు.

         తిరుపతి పట్టణమంటే చిరంజీవికి ఎంతో ఇష్టం కావడం వల్ల వీరి మేరేజ్ రిసెప్షన్ ను తిరుపతి సమీపంలోని తమ స్వగ్రామమైన అర్ధగిరిలో నిర్వహిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందుకు చిరంజీవి కూడా అంగీకరించారన్నారు. రామ్ చరణ్, ఉపాసనల వివాహ నిశ్చితార్ధం ఆమధ్య హైదరాబాదు శివారులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan
Mega star chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles