Prince mahesh babu not interested in doing remakes

Mahesh,Babu,not,interested,in,doing,remakes, Mahesh Babu Avoids Bollywood,Ram Charan Bollywood debut with Zanjeer remake,Mahesh Babu wants to stay in Tollywood and never wanted Bollywood,Ram Charan Bollywood Entry

Mahesh Babu who is on cloud nine with back to back hits is currently looking for the right scripts to better him and satisfy his fans. Mahesh recently revealed news.

Prince Mahesh Babu not interested.GIF

Posted: 01/30/2012 03:01 PM IST
Prince mahesh babu not interested in doing remakes

       Mashesh

       టాలీవుడ్ లో ఇప్పుడు అంతా మహేష్ బాబు మేనియా నడుస్తుంది. ‘దూకుడు, బిజినెస్ మేన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ఊపు మీదున్న మహేష్ పై అందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ’ఇంతితై వటుడింతై’ అన్నట్లు సినిమా సినిమాకి తన నటనా ప్రావీణ్యం చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సినిమా ఇండస్ర్టీలో రీమేక్ ల కాలం నడుస్తుంది. ఏ సినిమా ఏ భాషలో హిట్ అయినా దానికి మరో భాషలోకి రీమేక్ చేసే కొత్త ట్రెండ్ నడుస్తుంది. అయితే విజయాల ఊపు మీదున్న మహేష్ మాత్రం వాటికి దూరం అని అంటున్నాడు. నేటి హీరోలంతా నాటి హిట్ చిత్రాల రీమేక్ ల మీద మోజు పడుతున్నారు. అయితే, మహేష్ బాబు మాత్రం వాటికి 'నో' చెబుతున్నాడు. నాటి గొప్ప చిత్రాలను రీమేక్ చేస్తే వాటి గొప్పదనం పోతుందనేది మహేష్ అభిప్రాయమట. అందుకే అలాంటి చిత్రాలు చేయడమంటే మనసు అంగీకరించడం లేదని చెబుతున్నాడు.
     "రీమేక్ లంటే నాకిష్టం లేదు. అందుకే అవి చేయకూడదని నిశ్చయించుకున్నాను. నాన్న గారి చిత్రాలు కొన్ని రీమేక్ చేయమని కొందరు అడిగారు. అలా చేస్తే ఒరిజినల్ సినిమా గొప్పదనం పోతుంది. అందుకే నాన్నగారి సినిమాలే కాదు, ఎవరి సినిమాలూ రీమేక్ చేయను. మణిరత్నం లాంటి వాళ్ళ దర్శకత్వంలో చేయాలనేది నా కోరిక అంటూనే, అంతటి వాళ్ళు అడిగినా రీమేక్స్ చేయను ట్విస్ట్ ఇచ్చాడు. మరి మహేష్ నిర్ణయం సరైందేనని కొందరు అంటుంటే... ఇప్పుడు హిట్ సినిమాల ఊపు మీద ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. విజయాలు లేకపోతే రీమేక్ సినిమాలు చేయకపోతే ఏం చేస్తాడని మరి కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha fire on media
Vaasuki sunkavalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles