Great poet and writer vetoori

great poet, and writer, vetoori, sundara rama murty ,birth ,day ,today,

great poet and writer vetoori sundara rama murty birth day today

1.gif

Posted: 01/29/2012 12:28 PM IST
Great poet and writer vetoori

vetooriవేటూరి సుందరరామ్మూర్తి... ఆయన పేరు వింటేనే తెలుగు ప్రజల గుండెలు ఆహ్లాదంతో ప్రశాంతత పొందుతాయి. ఆయన శ్రోతలకు అందించిన మధుర పాటలు అటువంటివి. 1936  జనవరి 29 న కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించిన ఈయన వేటూరిగా సుపరిచితుడు. మంచి సాంప్రదాయక కుటుంభంలో జన్మించిన వేటూరి.. చంద్రశేఖర శాస్త్రి, కమలాంభల సంతానం. ఇవాళ ఆ దివ్య రచయిత జయంతి సందర్భంగా ఆయన అందించిన సాహితీ సౌరభాలను ఓ మారు శ్వాసిద్ధాం.

vetoori_samkarabharanamవేటూరి, తెలుగు సినిమా పాటకు కొత్త పరిమళాలద్దారు. 'సీత కథ' సినిమా వేటూరి కలాన్నిపరిచేయం చేయగా, పదాల్లోని మెరుపులు ...విరుపులు చూసి మరెన్నో అవకాశాలు ఆయన్ని వెదుక్కుంటూ వచ్చాయి. 70 వ దశకంలో వచ్చిన ' అడవిరాముడు'లో... ''కృషివుంటే మనుషులు ఋషులౌతారు..', 'పంతులమ్మ'లో...'' మానస వీణా మధు గీతం ..'', 'సిరిసిరి మువ్వ'లో..''ఝుమ్మంది నాదం..'' శంకరాభరణం'లో ''దొరకునా ఇటువంటిసేవా'' వంటి పాటల ప్రేక్షకులకు అందించారు వేటూరి.

      ve'శుభలేఖ'లో '' రాగాలా పల్లకిలో ...'', 'మేఘ సందేశం'లో ''ఆకాశ దేశాన...'', 'ప్రతిఘటన'లో ''ఈ దుర్యోధన దుశ్శాసన ...'', ' సితార' లో ''కిన్నెరసాని వచ్చిందమ్మ ...'', 'గీతాంజలి'లో  '' ఆమని పాడవే"... ఇలా 80 వ దశకంలో వచ్చిన ఎన్నో పాటల ద్వారా ఇటు క్లాస్ ఆడియన్స్ నీ, అటు మాస్ ఆడియన్స్ ని మంత్ర ముగ్థుల్ని గావించాయి. శంకరాభరణం, సాగర సంగమం, సప్తపది వంటి కళాత్మకమైన చిత్రాల్లోని పాటల్లో వేటూరి వెదజల్లిన సాహితీ సౌరభాలు మధురమైనవి -మరణం వరకు మరచిపోలేనివి. ఈ క్రమంలో ఆయన్ను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి.

vetoori_p90 వ దశకంలోనూ ఆయన ఎన్న మధురగీతాలను అందించారు.  వేటూరి పాటలను కేవలం సినిమా సాహిత్యం మాత్రమే కాదు. పాట వెనుక ఎన్నో పరమార్ధాలు. '' తార... తారకీ నడుమ ఆకాశం ఎందుకో..., ''ఝుమ్మంది నాదం... సైయ్యంది పాదం..., "అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమె సోపానము.., '' నరుడి బ్రతుకు నటన - ఈశ్వరుడి తలపు ఘటన.., '' మారేడు (మా రాజు ) నీవని...ఏరేరి తేనా 'మారేడు' దళములు నీ పూజకు.., '' రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... వంటి పద ప్రయోగాలు ఒక్క వేటూరికే సాధ్యమేమో.

vetoori_deathఇక, వేటూరి కుటుంభ విషయానికి వస్తే భార్యపేరు సీతా మహాలక్ష్మీ, ముగ్గురు కుమారులు. లంగ్స్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేరిన ఆయన 2010 మే 22న స్వర్గలోకాలకు పయనమయ్యారు. భౌతికంగా మనకు దూరమైనా ఆయన అందించిన మధుర గీతాలు ఈ పూడమి ఉన్నంతవరకూ బ్రతికే ఉంటాయి. ఎంతో మందికీ స్వాంతన చేకూరుస్తూనే ఉంటాయి.

...avnk

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Popular film actor kamal hassan
Celebrity cricket league  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles