Hero gopi chand new movie starts

hero, gopi chand ,new movie ,starts, in hyderabad, today ,dasari narayana rao ,give clap ,and director, rajamouli, switch on the camera,

hero gopi chand new movie starts in hyderabad today dasari narayana rao give clap and director rajamouli switch on the camera

16.gif

Posted: 01/28/2012 06:10 PM IST
Hero gopi chand new movie starts

          Gopichand_3 'మొగుడు' సినిమా తర్వాత గోపీచంద్ నటించబోతోన్న సరికొత్త చిత్రం షూటింగ్ షురూ అయింది.  ఈ రోజు హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో తాండ్ర రమేష్ బాలాజీ రియల్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ పతాకం మీద దీనిని నిర్మిస్తున్నారు.

           గోపీచంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా హీరో, దర్శక, నిర్మాతలు తమ అభిప్రాయాలు పంచారు.Gopichand_6


         హీరో గోపీచంద్ మాట్లాడుతూ : ‘డిఫరెంట్ లవ్ స్టోరీకి ఎంటర్ టైన్మెంట్ మిక్స్ అయిన సినిమా ఇది. ఇందులో పవర్ ఫుల్ హీరోయిజం వుంది. నన్ను డిఫరెంట్ గా చూపించే చిత్రం అవుతుంది’...దర్శకుడు భూపతి ఏమన్నారంటే :  ‘తెలుగులో తనకిది తొలి చిత్రం.  యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, రొమాన్స్ కలగలసిన చిత్రం’...నిర్మాత రమేష్ :  ‘రెగ్యులర్ షూటింగు మార్చ్ మొదటి వారం నుంచి చేస్తాం. హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు’. ఈ మధ్యనే ఈ నిర్మాత తమిళం లో రెండు చిత్రాలను నిర్మించారు “ఉత్తమపుత్తిరన్” మరియు “ఒస్తే” చిత్రాలు తమిళం లో భారీ విజయం సాధించాయి.Gopichand_8

           ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మాటలు ఎం.రత్నం అందిస్తున్నారు శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ. శౌర్యం శివ, సి కళ్యాణ్, బి వి ఎస్ ఎన్ ప్రసాద్ తదితరులు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు.


…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Celebrity cricket league
Godavari jillallo gundello godaari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles