Daggubati rana letest movie shooting

daggubati rana letest movie shooting bigins

daggubati rana letest movie

18.gif

Posted: 01/23/2012 06:13 PM IST
Daggubati rana letest movie shooting

17యుంగ్ హీరో దగ్గుబాటి రానా కొత్త చిత్ర షూటింగ్ షురూ అయింది. కృష్ణం వందే జగద్గురుమ్పేరిట వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇవాళ్టి నుంచే ప్రారంభమయింది. ఈ మూవీలో రానా సరికొత్త గా కనిపించబోతున్నారని సమాచారం. బీటెక్ బాబుగా విభిన్న శైలిలో రానా ప్రదర్శన ఉండనుందని భోగట్టా. అయితే హీరో రానా సరసన ఏ సుందరాంగి జోడీ కడుతుందనేది ఇంకా పైనలైజ్ కాలేదు.

జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమౌతోంది. దర్శకుడు క్రిష్ కు ఈ సినిమా మూడవది. గతంలో ఈయన గమ్యం’, ‘వేదంవంటి విభిన్నతరహా చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్రను వేసుకున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.

ఇక హీరో రానా విషయానికొస్తే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్సినిమాతో తెరంగేట్రం చేశారు రానా. అనంతరం ఆయన దమ్ మారో దమ్అనే హిందీ సినిమాలోనూ నటించారు. ఈమధ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన నేనూ నా రాక్షసిచిత్రంలో రానా అభిమన్యు పాత్రను పోషించారు. ప్రస్తుతం రానా నటిస్తోన్న డిపార్ట్ మెంట్’ ‘నా యిష్టం’ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్నాయి.

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young rebal star prabhas
Comedy actor turns action hero sunil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles