భారీ అంచనాలతో చిత్రనిర్మాణం జరుపుకుంటోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోర్త్ కమింగ్ మూవీ.. `గబ్బర్ సింగ్`. ఈ సినిమా షూటింగ్ జనవరి 5 నుంచి హైదరాబాద్ లో జరుగనుంది. నగరంలో రెండు వారాల పాటు సాగే చిత్రీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తదుపరి షెడ్యూల్ 20 వ తేదీ నుంచి పూణేలో చేస్తారు. సాధ్యమైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసి ఏప్రిల్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్రయూనిట్ శ్రమిస్తోంది.
ఇక చిత్రకథాంశానికి సంబంధించి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ దబాంగ్ ఈ సినిమాకు ఆధారం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మూవీని తెరకెక్కిస్తున్నారు. కొండవీడు పేరు మెగా అభిమానుల్లో ఎప్పటికీ మరువలేనిదని మనకి తెలుసు. అదే ప్రాంత పోలీస్ ఆఫీసర్ గా పవన్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పవన్ ఫ్యాన్స్ కూ, అటు సినిమా అభిమానులకూ అమితంగా నచ్చేసింది. పవర్ స్టార్ సరసన నటిస్తోన్న శ్రుతి హాసన్ కెరీర్ లో ఈ సినిమా ఆణిముత్యంగా నిలిచిపోనుందని కూడా చిత్రవర్గాలు చెబుతున్నాయి.
హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న`గబ్బర్ సింగ్` చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more