Samantha ruth prabhu

samantha ruth prabhu, Samantha Ruth Prabhu Pics, Samantha Ruth Prabhu Photos, amantha ruth prabhu latest wallpapers, samantha ruth prabhu new cute wallpapers, telugu actress samantha ruth prabhu

samantha ruth prabhu

samantha.GIF

Posted: 12/11/2011 02:42 PM IST
Samantha ruth prabhu

samantha ruth prabhu

జీవితం చాలా విచిత్రమైనది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. అందుకు నా జీవితమే ఉదాహరణ. ‘మాయ చేశావె’కి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఒక్క సంవత్సరంలో నా జీవితం మారిపోయింది’’ అంటున్నారు సమంత. ప్రస్తుతం ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ లిస్ట్‌లో ఉన్నారామె. వరసగా పెద్ద సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ‘మాయ చేశావె’లాంటి హిట్‌తో తనకు చిత్రపరిశ్రమలో తిరుగులేని స్థాయిని కల్పించిన గౌతమ్ అంటే సమంతకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సమంత నాయికగా నటిస్తున్నారు.

మూడు భాషల్లో హీరో మారతారు కానీ హీరోయిన్‌గా మాత్రం సమంతనే ఉంటారు. ఇలా ఒకే పాత్రను మూడు భాషల్లో చేయడం ఎలా అనిపిస్తోంది? అని సమంతను అడిగితే -‘‘ఒకే సన్నివేశాన్ని మూడు భాషల్లో ముగ్గురు హీరోల సరసన చేయడం కొత్త అనుభూతినిస్తోంది. గౌతమ్ టాలెంటెడ్ డెరైక్టర్. అందుకని ఈజీగానే ఉంది’’ అని చెప్పారు. కథానాయికల్లో ‘నంబర్‌వన్’ స్థానం మీదే అని చాలామంది అంటున్నారు... దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని సమంతను అడిగితే -‘‘నంబర్‌గేమ్‌ని నమ్మను. నంబర్లు శాశ్వతం కాదు. 

శుక్రవారం విడుదలైన సినిమాల్లో నాది హిట్ అయితే.. నేను నంబర్‌వన్ కింద లెక్క. తర్వాత వేరే హీరోయిన్ సినిమా హిట్ అయ్యిందనుకోండి.. అప్పుడు మరో శుక్రవారానికి నా ప్లేస్‌లో ఇంకో హీరోయిన్ వచ్చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే అందం, ప్రతిభ మాత్రమే సరిపోదు. అదృష్టం కూడా తోడవ్వాలి. ఇవాళ అదృష్టం నావైపు ఉంది. అందుకే వరసగా విజయవంతమైన సినిమాలు వరిస్తున్నాయి. నా డైరీ ఫుల్ బిజీగా ఉంది. ఫ్రెండ్స్, పార్టీలు, మ్యారేజ్ ఫంక్షన్లు, గెట్ టు గెదర్‌లు... ఇవన్నీ మిస్ అయ్యేంత బిజీగా ఉన్నాను. అయినా ఏం ఫర్వాలేదు. చాలామంది కోరుకున్నా ఇలాంటి జీవితం రాదు కదా ’’ అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood actress vedika
Shruti hassan out in pawan kalyas new movie gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles