Evergreen hero dev anand to be cremated in london

ఎవర్ గ్రీన్ హీరో దేవ్ ఆనంద్, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

ఎవర్ గ్రీన్ హీరో దేవ్ ఆనంద్, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

romantic Dev Anand.GIF

Posted: 12/06/2011 03:42 PM IST
Evergreen hero dev anand to be cremated in london

dev_anand1ఎవర్ గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకున్న హిందీ చిత్ర రంగంలోని హీరో దేవ్ ఆనంద్ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. సహజ నటనంటే ఏమిటో దేవ్ ఆనంద్ నటనను చూస్తే తెలుస్తుంది. ఆయన ముఖంలో హావభావాలు, శరీర కదలికలతో పాటు, సంభాషణా శైలి ఎవరూ అనుకరించలేని విధంగా ఉండేవి. నేర పరిశోధనాంశాలతో ఉండే సినిమా కథల్లో చాలా చక్కగా ఒదిగిపోయి నటించేవారు. హరేరామ హరే కృష్ణ లాంటి వైవిధ్యంగల సినిమాలతో సంచలనాన్ని సృష్టించిన దేవ్ ఆనంద్ పూర్తి పేరు ధరమ్ దేవ్ ఆనంద్. సినిమా పరిశ్రమలో 65 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిన దేవానంద్ ని భారత ప్రభుత్వం 2001 లో పద్మభూషణ్ బిరుదుతోనూ, 2002లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతోనూ సత్కరించింది. దేవానంద్ తన సినీజీవితంలో నటించిన 114 సినిమాల్లో 110 సినిమాలు ప్రధానపాత్ర వహించినవే. లవర్ బాయ్ గా, అపరాధ పరిశోధకుడిగా, పోలీస్ ఆఫీసర్ గా, సైనికుడిగా, మేజర్ గా, ఆకతాయిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో మెప్పించిన దేవానంద్ డిసెంబర్ 3న లండన్ లో గుండెపోటుతో మరణించారు.

1923లో పంజాబ్ లోని గురుదాస్పూర్ షకర్గఢ్ తాలూకాలో (ప్రస్తుతం పాకిస్తాన్) జన్మించిన దేవానంద్ కి ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు. పెద్దన్న మన్మోహన్ ఆనంద్ పాకిస్తాన్ లో అడ్వకేటే. రెండవ అన్న చేతన్, తమ్ముడు విజయ్ ఆనంద్ లు కూడా సినిమా రంగంలో దేవానంద్ తో పనిచేసారు. 1940లో తన సొంత వూరు నుంచి బొంబాయి వలసపోయిన దేవానంద్ అప్పటికే అక్కడ నాటకరంగంలో పనిచేస్తున్న చేతనానంద్ సాయంతో థియేటర్లో కాలు పెట్టి త్వరలోనే (1946) ప్రభాత్ ఫిల్మ్స్ వారి హమ్ ఏకే హై సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఆ సమయంలో దర్శకుడు గురుదత్ తో . పరిచయం స్నేహంగా మారి, ఒకరికొకరు సాయం చేసుకుంటే ఆయన దర్శకత్వంలో దేవానంద్ పనిచెయ్యటానికి దేవానంద్ కి నటించే అవకాశం వస్తే గురుదత్ దర్శకత్వం వహించటానికి ఒప్పందం చేసుకున్నారు.

dev_anand_21940లో ప్రఖ్యాత గాయకురాలు సురైయాతో కలిసి నటించే అవకాశం రావటంతో, ఆ సమయంలో దేవానంద్ కి ఆమెతో జరిగిన పరిచయం ప్రణయంలోకి మారింది. వరసగా వారిద్దరూ నటించిన ఏడు సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఒక సినిమా పాట చిత్రీకరణలో బోటు తిరగబడితే దేవానంద్ నిజజీవితంలో హీరోలా ఆమెను రక్షించారు. కొన్నాళ్ళు ప్రేమాయణం సాగిన తర్వాత ఒకరోజు దేవానంద్ సురైయాకి ఆ రోజుల్లోనే మూడు వేల రూపాయల ఖరీదు చేసే డైమండ్ రింగ్ ఇస్తూ వివాహానికి ప్రతిపాదించారు. కానీ ఆమె మేనమామ వీరి పెళ్ళికి అభ్యంతరాలు తెలియజేసారు. ఆమె ముస్లిం, దేవానంద్ హిందు అవటమే అందుకు కారణం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించటం కూడా మానేసారు. సురైయా అవివాహితగానే మిగిలిపోయింది.

అశోక్ కుమార్ సాయంతో 1948లో జిద్దీ అనే హిందీ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత దేవానంద్ కి సొంతంగా సినిమా నిర్మించాలనే ఆలోచన వచ్చింది. జిద్దీ సినిమాలో దేవానంద్ కి కిషోర్ కుమార్ పాట పాడగా అది కూడా మంచి జనాదరణ పొందింది. ఆ తర్వాత కల్పనా కార్తిక తో జంటగా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత వీరిద్దరూ దగ్గరై పెళ్ళి వరకూ వచ్చారు. వీరి కుమారుడే సునీల్ ఆనంద్. పెళ్ళి తర్వాత కార్తిక సినిమాల్లో నటించటం మానేసారు.

1dev_anand_3950లో నేర పరిశోధనాంశంతో తీసే సినిమాల్లో నటించి, అ తర్వాత 1960లో ప్రేమ కథా చిత్రాల్లో నాయకుడిగా ముద్ర వేసుకున్న దేవానంద్, 1970లో దర్శకుడిగా విభిన్న కథాంశాలతో సినిమా నిర్మాణాన్ని చేపట్టారు. అందులో హరే రామ హరే కృష్ణ, ప్రేమ్ పుజారి లాంటి సినిమాలున్నాయి. అలా 1982 వరకూ దేవానంద్ నటించి నిర్మించి, దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు బహుళ ప్రజాదరణ పొందటమే కాకుండా మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టాయి. కానీ, 1984లో కుమారుడి సునీల్ ఆనంద్ హీరోగా నిర్మించిన ఆనంద్ అండ్ ఆనంద్ సినిమా ఫెయిలయింది. దానితో సునీల్ ఇక మళ్ళీ నటించనని నిర్ణయించుకున్నారు. 2011 లో కూడా ఛార్జ్ షీట్ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన దేవానంద్, ఆరు దశాబ్దాల్లో వరసగా 110 సినిమాల్లో ప్రధాన పాత్రను పోషించిన హీరోగా చరిత్రను సృష్టించారు.

dev_anand_7సహజమైన రీతిలో, డైలాగ్స్ చెప్తూ తలతిప్పటంలో తనదైన విశిష్టమైన శైలి కలిగిన దేవానంద్ ఈ కాలపు హీరోల్లాగా కండపుష్టితో ఉండేవారు కాదు. ఆ కాలంలో కూడా ధర్మేంద్ర, ఫిరోజ్ ఖాన్ లతో పోల్చి చూసుకుంటే చాలా నాజూకుగా ఉండేవారు. దాన్ని కప్పి పుచ్చుకోవటానికి తల మీద ఒక టోపీ, మెడలో స్కార్ఫ్ తో తెరమీద కనిపించేవారు.  

నేర పరిశోధనలు, ప్రేమ కథా చిత్రాలు, దేశభక్తి చిత్రాలే కాకుండా ఎంతో వైవిధ్యంగల పాత్రలన్నిటిలోనూ రాణించిన దేవానంద్ మృతికి హిందీ సినిమా రంగమంతా శోకసాగరంలో మునిగిపోయింది. కానీ ఎటువంటి వ్యాదికీ గురికాకుండా, మంచం పడకుండా, హాస్పిటల్ లో చేరకుండా లండన్ లో బస చేస్తున్న ఒక హోటల్లో ప్రశాంతంగా తుది శ్వాసను వదిలారు. జీవితంలోని ప్రతి అంశాన్నీ పోజిటివ్ గా తీసుకుని సరళమైన ప్రవృత్తితో ప్రశాంతమైన జీవనాన్ని సాగించిన దేవానంద్ మరణ వార్త విన్న వారంతా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూనే ఆయన ఎప్పుడూ శాంత సౌమ్య స్వభావంతో ఉండేవారు కదా అని గుర్తు చేసుకున్నారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mayakkam enna tamil movie press mee
Anushka a ranveer slam gossip mongers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles