Mayakkam enna tamil movie press mee

Mayakkam Enna Tamil Movie Press Meet, Richa Gangopadhyay photos, Richa Gangopadhyay gossip, Richa , Tamil Movie Stills, Richa Gangopadhyay Movie, Tamil movie stills, new tamil movies online, tamil movie gallery, telugu movie stills

Mayakkam Enna Tamil Movie Press Meet

Richa Gangopadhyay.GIF

Posted: 12/06/2011 04:46 PM IST
Mayakkam enna tamil movie press mee

Richa Gangopadhyay

ఒకేసారి ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాలు చేస్తే ఓ సౌకర్యం ఉంది. రెండు భాషలనూ నేర్చుకోవచ్చు. రుంబ (తమిళంలో రుంబ అంటే ‘చాలా’) సంతోషం’’ అంటున్నారు రిచా గంగోపాధ్యాయ. తమిళంలో మయక్కమ్ ఎన్న, ఓస్తి చిత్రాల్లో నటించిన రిచా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నాయికగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగానే ఈ బ్యూటీ పై విధంగా స్పందించారు. ఇప్పుడామె పరిస్థితి గాల్లో తేలుగుతున్న దూది పింజలా ఉంది. దానికి కారణం తమిళ చిత్రం ‘యమక్కమ్ ఎన్న’. దానర్థం ‘మైకం ఎందుకు?’ అని. ఏ క్షణాన రిచా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారో కానీ ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని చూసినవారు రిచా అందచందాలకు మైకం వచ్చేస్తోంది అంటున్నారు.

అందంగా కనిపించడంతో పాటు ‘యామిని’ పాత్రను అద్భుతంగా చేశారట రిచా. ప్రస్తుతం చాలామంది కుర్రకారు యామినీలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఓ కుర్రాడైతే ‘‘నేను త్వరలో పెళ్లి చూపులకు వెళ్లబోతున్నాను.  అమ్మాయి యామినీలా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఏకంగా రిచా ట్విట్టర్‌కి ఓ వార్త పోస్ట్ చేశాడు.

మొదటి చిత్రంతోనే తమిళీయులను ఇంతలా ఆకట్టుకోగలిగినందుకు రిచా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేరుని కాపాడుకునేలా ఇకనుంచి కూడా మంచి పాత్రలు చేస్తానని మాటిచ్చారు కూడా. ప్రస్తుతం చేస్తున్న తెలుగు చిత్రం కాకుండా హిందీలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నారారు రిచా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bipasha basu in bikini dhoom 2
Evergreen hero dev anand to be cremated in london  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles