Taman posts pictures of mahesh babu in recording room

Taman Posts Pictures Of Mahesh Babu In Recording Room, usiness Man.S S Thaman, Mahesh Babu's Business Man title song completed by Taman, Puri Jagannadh are singing a theme song

Taman Posts Pictures Of Mahesh Babu In Recording Room

Mahesh Babu.GIF

Posted: 12/06/2011 01:55 PM IST
Taman posts pictures of mahesh babu in recording room

Taman Posts Pictures Of Mahesh Babu In Recording Room

గత కొంతకాలంగా సంగీత ప్రపంచంలో వరుస విజయాలతో సంచలనాలకు కేరాఫ్ అయిన తమన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. ‘దూకుడు’తో తన తిరుగులేని ఇమేజ్‌ని మళ్లీ సొంతం చేసుకున్న మహేష్‌బాబుతో ‘బిజినెస్‌మేన్’ చిత్రంలో పాట పాడించి అందరి దృష్టినీ ఇప్పుడు తనవైపు ఆకర్షిస్తున్నారు తమన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్‌ఆర్ మూవీమేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఓ థీమ్ సాంగ్‌ని కావాలని పట్టుబట్టి మహేష్‌చేత తమన్ పాడించారు.

 ఈ పాటలో కొన్ని డైలాగులు కూడా ఉంటాయట. ఈ డైలాగులను మహేష్ అద్భుతంగా పలికారని, సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు రాక్ చేశారని కూడా తమన్ అన్నారు. ఈ పాటకు ఇటీవల తమిళంలో ధనుష్ పాడిన ‘కొలవెరి’ పాటకు ఆలోచనలో కానీ, అమలులో కానీ ఎటువంటి పోలిక లేదని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నెల 22న ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. కచ్చితంగా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తమన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero gopichand is going to marry very soon
Divya bharti was a popular indian film actress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles