the best fruit packs for face to get shiny and glowing skin within few days | skincare remedies | skin beauty tips

Fruit packs for face to get shiny and glowing skin

fruit packs, fruit face packs, best packs for face, face beauty tips, face beauty tips, beauty face tips, shiny skin remedies, glowing skin tips

fruit packs for face to get shiny and glowing skin : the best fruit packs for face to get shiny and glowing skin within few days.

ఈ ఫ్రూట్ ప్యాక్స్ తో మెరుపులీనే సౌందర్యం సొంతం..

Posted: 11/10/2015 12:46 PM IST
Fruit packs for face to get shiny and glowing skin

ప్రస్తుత ఆధునిక యుగంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో సౌందర్యం కూడా అంతే! ముఖ్యంగా మహిళలకు సౌందర్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. వాతావరణ కాలుష్య ప్రభావం కారణంగా వచ్చే చర్మ సమస్యల్ని నిర్మూలించుకోవాలంటే.. రకరకాల పద్ధతుల్ని అనుసరించాల్సి వస్తుంది. అయితే.. వాటన్నిటికంటే.. కొన్ని ఫ్రూట్ ప్యాక్స్ ముఖానికి పట్టిస్తే కాంతులీనే చర్మసౌందర్యం సొంతం చేసుకోవచ్చని బ్యూటీషియన్లు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* అరటి పండు : అరటి పండును బాగా మగ్గించి, దాన్ని మెత్తగా గుజ్జులా చేయాలి. ఆ గుజ్జును ముఖానికి రాసుకోవాలి. మొటిమల సమస్య ఉంటే గుజ్జుకు కొంచెం తేనె లేదా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.

* యాపిల్ పండు : యాపిల్‌ పండును గుజ్జులా చేసి దానిలో కొద్దిగా తేనె కలపాలి. ఆ పేస్టును ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నునుపు దేలుతుంది.

* ద్రాక్షపళ్లు : మొటిమలతో బాధపడేవాళ్లు ద్రాక్షపళ్ల గుజ్జును ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు వుంటాయి. ద్రాక్షపళ్ల గుజ్జును ముఖానికి రాసుకుని అది ఎండిపోయేవరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ద్రాక్షపళ్ల ఫేస్‌ ప్యాక్‌తో ముఖం మీద ఏర్పడ్డ చిన్న మచ్చలు సైతం పోతాయి.

* బొప్పాయి పండు : బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును తీసి మెత్తగా చేసి దాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి.

* స్ట్రాబెర్రీ : డల్‌ స్కిన్‌కు స్ట్రాబెర్రీ ఫేస్‌ప్యాక్‌ చాలా మంచిది. స్ట్రాబెర్రీస్‌కు కొద్దిగా నీటిని జోడించి మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ గుజ్జును ముఖానికి రాసుకుని ఎండిపోయేదాకా అలాగే ఉంచుకోవాలి. మిక్స్డ్‌ ఫ్రూట్‌ ప్యాక్‌ కూడా రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

* టమోటా : ఎప్పుడూ నూనెలు కక్కుతూ జిడ్డు చర్మం ఉన్నవారికి టొమాటో మాస్క్‌ చాలా బాగా పనిచేస్తుంది. టొమాటోను పిండి ఆ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపు అలాగే ఉంచుకున్న తర్వాత ముఖాన్ని నీళ్లతో కడిగేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fruit packs for skin  glowing skin remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more