వయస్సు తో నిమిత్తం లేకుండా , అందంగా 40 లలో కూడా కనీసం 30 ఏళ్ళ వయస్సు ఉన్నట్టు ఉండాలని , ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి ... అయితే , సాధారణం గా 35 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత , చర్మం లో చోటు చేసుకునే , ముడతలు , చర్మం సహజ కాంతిని కోల్పోవడం వంటి ఎన్నో మార్పులని , 'వయస్సు వచ్చేసింది లే ' అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటాం . కాని , కాస్త జాగ్రత్తలు పాటిస్తే , ఏ వయస్సు లో ఉన్నా , చర్మం 10 సంవత్సరాలు తక్కువ వయస్సుతో దర్సనం ఇవ్వడం గ్యారెంటీ ;
ప్రతీ రోజు ఒక సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది . నిద్రపోయేముందు ఆ రోజు ఏం చేసామో ఆలోచిస్తాం , తరువాతి ఉదయం నిద్ర లేచిన తరువాత ఈ రోజు ఏం చెయ్యాల అని ఆలోచన . నిద్రలేమి , రక్తపోటు పెంచడం తో పాటు , ఈ టెన్షన్ వల్ల చర్మం త్వరగా కాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది . అందుచేత వీలయినంత వరకు ఈ ఆలోచనల్ని తగ్గించుకోండి . ఆలోచించే బదులు ఆరోజు చేసే పనులని ప్రణాళిక వేసుకోండి , చేసిన పనులని కూడా రాసే ప్రయత్నం చెయ్యండి .
కనీసం రోజుకో అరగంట మీకు ఇష్టమైన వ్యాయామం , వ్యాపకానికి కేటాయించండి . వారం లో ఏ ఒక్కరోజో అని నియమం పెట్టుకోకుండా , రోజుకి కాస్త సమయం అయినా , సేద తీరండి .
ముడతలు పెరిగే వయస్సుని తెలియచేస్తాయి . వీటి రాకని వీలయినంతవరకు లేటు చెయ్యాలి అంటే , నీటి శాతం ఎక్కువగా ఉండే , కీర , ఆకుపచ్చని కూరగాయలు , నీళ్ళు , కొబ్బరి నీళ్ళు , పళ్ళు , మీ ఆహారం లో భాగం గా చేసుకోవాలి . జంక్ ఫుడ్ నోటికి రుచిగా ఉన్నా , ఎప్పుడో తప్ప వీటి జోలికి పోకుండా ఉండటమే మంచిది . ఇవి మన ఆరోగ్యానికే కాక , చర్మానికి , అందానికి కూడా హాని చేస్తాయి అని గుర్తుంచుకోండి .
ఈ చిన్న పాటి జాగ్రత్తల వల్ల , నిత్య యవ్వనమైన చర్మం మీ సొంతం .
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more